‘స్వచ్ఛ జిల్లా’గా మారుద్దాం..


Sat,May 18, 2019 11:12 PM

- జూన్‌ 2 నాటికి పూర్తి చేయాలి
- జిల్లాలో మొత్తంగా 58వేల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది
- నిర్మాణంలో జిల్లా 33వ స్థానం
- 12 రోజుల్లో పనులు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి
- డీఆర్‌డీఏ పీడీ జాన్సన్‌, డీఆర్‌వో మోతీలాల్‌

కొడంగల్‌, నమస్తే తెలంగాణ : మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లా చాలా వెనుబడి ఉందని, జూన్‌ 2న నిర్వహించుకునే తెలంగాణ అవతరణ దినోత్సవం నాటికి జిల్లాను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని డీఆర్‌డీఏ పీడీ జాన్సన్‌, డీఆర్‌వో మోతీలాల్‌లు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్మాణాలపై చేపట్టాల్సిన ప్రణాళికలపై వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ, ఆశ, మహిళా సమాఖ్య సిబ్బందికి సూచనలు సలహాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవానికి స్వచ్ఛభారత్‌ మిషన్‌ పథకంలో భాగంగా ఇంటింటికీ మరుగుదొడ్డి పథకం నాలుగేండ్లుగా దేశం, రాష్ట్ర, జిల్లాల్లో కొనసాగుతుందని తెలిపారు. జిల్లా పరిధిలో జూన్‌ 2 నాటికి మొత్తంగా 58వేల మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టే లక్ష్యం ఉందని, ఇందుకు గాను ఇప్పటి వరకు 14 మండలాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించడంతో పాటు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. జూన్‌ 2 నాటికి ఇంకా 12 రోజులు మాత్రమే మిగిలిందని, కొడంగల్‌ మండల పరిధిలో మొత్తంగా 6వేల మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 600ల మరుగుదొడ్ల నిర్మాణాలు మాత్రమే జరిగాయని తెలిపారు. దీనంతటికీ సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా నిర్వర్తించకపోవడంమేనని, అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేసిన సిబ్బంది హాజరు కాకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంటే సిబ్బంది పట్టనట్లుగా వ్యవహరిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మండలాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి చాలా మంది సిబ్బంది హాజరు కావడం జరిగిందని, కొడంగల్‌లో ఐహెచ్‌ఎల్‌ వెనుకబడి ఉండటానికి నిర్ణక్ష్యవైఖరే కారణంగా పేర్కొన్నారు. పక్కనే ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లా డిసెంబర్‌ 18 నాటికి 30 జిల్లాల్లో 30వ స్థానంలో ఉండిపోయింది. 15 ఎప్రిల్‌ 2019 నాటికి మూడున్నర నెలల్లోనే 34వేల మరుగుదొడ్లను పూర్తి చేసి ముందంజలో ఉన్నట్లు తెలిపారు. కాగా వికారాబాద్‌ జిల్లా అప్పట్లో 26 స్థానంలో ఉంటే నేడు 33 స్థానంలో ఉండటం మన నిత్సాహయతను నిదర్శనంగా పేర్కొన్నారు.

సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, ఆశ, అంగన్‌వాడీ, మహిళ సమాఖ్య సిబ్బంది లక్ష్యం పూర్తి చేసేందుకు ప్రణాళికలను సిద్ధ్దం చేసుకొని యుద్ధ ప్రాతిపధికన పనులు చేపట్టాలని సూచించారు. పంచాయతీ సెక్రటరీలు మండలంలోని అన్ని గ్రామాల్లో ముందుగా కన్‌స్ట్రక్షన్‌ కమిటీని ఏర్పాటు చేయాలని, ఇందులో గ్రామంలోని సిబ్బందిని, సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను సభ్యులుగా మొత్తంగా 21 మందితో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామంలో నిర్మాణం చేయాల్సిన మరుగుదొడ్లను ఆ 21 మందిని భాగస్వామ్యం చేస్తు వారికి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. మహిళా సంఘం వారు తప్పక మరుగుదొడ్ల నిర్మాణాలకు ముందుకు రావాలని, ఆర్థిక ఇబ్బందులు ఉంటే సంఘంలో సభ్యులుగా ఉన్న మహిళలకు స్త్రీనిధి ద్వారా రుణాలను అందించి మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రోత్సహించాలని సూచించారు. మరుగదొడ్ల నిర్మాణాలతో కలిగే లాభాలను, మరుగుదొడ్లు లేకుంటే ఎలాంటి నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందో ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి మహిళల్లో తప్పక చైతన్యం తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటేశ్‌, ఎంపీడీవో మోహన్‌లాల్‌, అడిషనల్‌ సీడీపీవో కాంతారావు, డీపీఎం, ఏపీవో రాములు, ఏవీఎం సాయన్నలతో పాటు వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...