అభివృద్ధి దిశలో పూడూరు మండల్‌


Sat,May 18, 2019 11:11 PM

పూడూరు : మండల పరిధిలోని పలు ప్రాంతాలు అభివృద్ధి దిశలో ముందుకు సాగుతున్నాయి. పూడూరు మండలంలో కోట్లాది రూపాయలతో పరిశ్రమలు, భవనాలు, రోడ్ల నిర్మాణాలు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి అభివృద్ధి పనులు జరిగాయి. రాకంచర్ల వద్ద పారిశ్రామిక కేంద్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు అర్హులైన వారికి స్థలం కేటాయిస్తునట్లు అధికారులు పేర్కొంటున్నారు. కంకల్‌ సమీపంలోని ఈసీ వాగుపై సుమారుగా రూ.2 కోట్లతో వంతెన నిర్మాణం పనులు పూర్తి అయ్యాయి. చన్గోముల్‌ వద్ద ఉన్న వాగుపై రూ.1కోటిపై నిధులతో వంతెన నిర్మాణం పనులు పూర్తి కావచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్‌రాష్ట్ర రోడ్ల వెడల్పు కోసం ప్రత్యేక దృష్టి పెట్టి ప్రస్తుతం మన్నెగూడ నుంచి పరిగి వరకు మూడు లైన్‌ల రోడ్డు వెడల్పు పనులు 80 శాతం పూర్తి అయ్యాయి. కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, నిల్చిపోయిన పంచాయతీ భవనాల నిర్మాణాలపై దృష్టిపెట్టి ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తి చేయిస్తున్నది. మన్నెగూడ మీదుగా హైదరాబాద్‌,తాండూర్‌, కొడంగల్‌ ఇతర దూర ప్రాంతాలకు వెళ్లే అధికారులకు, ప్రజా ప్రతి నిధులకు, మండలంలో పర్యటించి సేద తీర్చుకునేందుకు గాను జిల్లా పరిషత్‌ నిధుల నుంచి గెస్ట్‌ హౌజ్‌ నిర్మాణం చేయించారు. రెండేండ్ల క్రితం కొన్ని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్లకు బీటి నిర్మాణాలకు నిధులు కేటాయించి పూర్తి చేయించింది. ప్రస్తుతం అంగడి చిట్టంపల్లి నుంచి మేడిపల్లి కలాన్‌ వరకు ఆర్‌అండ్‌బీ బీటీ రోడ్డు పనులు పూర్తి చేశారు. రాకంచర్ల వద్ద మిషన్‌ భగీరథ ద్వారా సుమారు లక్ష లీటర్ల నీటి సమర్థ్యం గల మంచి నీటి ట్యాంక్‌ పనులు పూర్తయ్యాయి. ఈ ట్యాంక్‌ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు అందేలా పైపులైన్లు ఏర్పాటు చేసి సఫ్లయ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంతో పాటుగా ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటు చేసింది. మోడల్‌ స్కూల్‌లో 6 నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులకు ఉచిత విద్యను అందజేయడమే కాకుండా సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందజేస్తుంది. కంకల్‌లో మినీ స్టేడియం, అదే గ్రామ సమీపంలో ఓ లిక్కర్‌ పరిశ్రమ, రాకంచర్ల వద్ద ఆయిల్‌ శుద్ధి కోసం కెమికల్‌ ఏర్పాటు పరిశ్రమ ఏర్పాటుతో పాటుగా మరో కొత్త పారిశ్రమ నిర్మిస్తున్నారు. మండల పరిధిలోనే మూడు పత్తి జిన్నింగ్‌ మిల్లులు ఉండటంతో రైతుల సౌకర్యం కోసం ప్రభుత్వం సీసీఐ ద్వారా నేరుగా రైతుల నుంచే పత్తి కొనుగోలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహంతో పెద్ద ఉమ్మెంతాల్‌ ప్రాంతంలో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి ప్రతి రోజూ 5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చెయగా, మరో ప్లాంట్‌ కూడా నిర్మాణం పూర్తయింది.

మండల పరిధిలో నేవీ కేంద్రం, ఆర్మీ గ్రౌండ్‌ వంటివే కాకుండా, మన్నెగూడ సమీపంలో ఇంటర్‌నేషనల్‌ స్థాయి గోల్ఫ్‌కోర్టు ఏర్పాటుతో పూడూరు మండలం పేరు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న గోల్ఫ్‌కోర్ట్‌కు పలు విదేశాల వారు వచ్చివెళ్తున్నారు. ఐదేండ్లలోనే పూడూరు మండలంలో అనేక అభివృద్ధితో మార్పులు చోటు చేసుకున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...