రైతులు తప్పనిసరిగా భూ సార పరీక్షలు చేసుకోవాలి


Sat,May 18, 2019 11:11 PM

- అధికారుల సూచన మేరకు పంటలు వేసుకోవాలి
- వేసవి దుక్కులతో భూమిలో చీడపీడల నివారణ
- సకాలంలో విత్తనాలు వేసి, సేంద్రియ ఎరువులు వాడాలి
- వ్యవసాయ విస్తరణ అధికారి సంజీవ్‌ రాథోడ్‌
- పైలెట్‌ ప్రాజెక్టు కింద అవుసుపల్లి గ్రామం ఎంపిక

ధారూరు : ప్రతి ఒక్క రైతు భూ పరీక్షలు నిర్వహించుకోని అందుకు అనుగుణంగా పంటలు వేసుకోని అధిక దిగుబడులు సాధించి ఆర్థికాభివృద్ధి సాధించాలని వ్యవసాయ విస్తరణ అధికారి సంజీవ్‌ రాథోడ్‌ రైతులకు సూచించారు. శనివారం మండల పరిధిలోని అవుసుపల్లి గ్రామంలో భూ సార పరీక్షలు పైలెట్‌ ప్రాజెక్టు కింద గ్రామాన్ని ఎన్నుకోని 187 మట్టి నమూనాను సేకరించి పరీక్షలు నిర్వహించేందుకు సేకరించారు. ఈ సందర్భంగా ఏఈవో మాట్లాడుతూ రైతుల పొలాల్లో మట్టి సేకరించి పరీక్షలు నిర్వహించి వారికి సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా భూ సార పరీక్షలు చేయించుకోవాలన్నారు. లోతు దుక్కులతో దున్నుకుంటే భూ సారం పైకి వచ్చి పంటలకు మేలు జరుగుతుందన్నారు. వేసవిలో దుక్కులు దున్నుకుం టే భూమిలో చీడ పురుగులను నివారించవచ్చు, సకాలం లో విత్తనాలు వేసి సేంద్రియ ఎరువులను వాడాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుండడంతో ఉష్ణోగ్రతలతో భూమి పొడిగా మారడంతో పరీక్షలు చేయించుకునేందుకు సరైన సమయం అన్నారు. రైతులు సరైన పద్ధతులను పా టించి మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆ పొలాల్లో ఏ ఏ పంటలు పండుతాయో అధికారుల సూచనల మేరకు పంటలు, ఎరువులు వేయాలన్నా రు. పొలంలో నమూనాలు సేకరించే సమయంలో 15 సెం.మీ లోతు నుంచి వీ ఆకారంలో పారతో తవ్వి మట్టిని సేకరించాలన్నారు. 10 చోట్ల తీసిన మట్టిని ఒక దగ్గర బాగా కలిపి పరీక్షలకు తీసుకురావాలన్నారు. రైతులు సేకరించిన మట్టిని కవర్లో పోసి రైతు పేరు వివరాలు కాగితంపై రాసి విస్తరణ అధికారికి అందజేయాలని సూచించారు. రైతు వద్ద నుంచి సేకరించే మట్టిని పరిగి మండల కేంద్రంలోని భూ సార పరీక్ష కేంద్రానికి పంపడం జరుగుతుందన్నారు. పరీక్షల అనంతరం జూన్‌ మొదటి వారంలో భూ సార పరీక్ష ఫలితాలు వస్తాయన్నారు. భూ సారాన్ని తెలుసుకొని అందుకు అనుగుణంగా పంటలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...