సీఎం కేసీఆర్ పరిపాలనను చూసి టీఆర్‌ఎస్‌లో చేరిక


Fri,May 17, 2019 11:01 PM

- ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
వికారాబాద్, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ పరిపాలనను చూసి అనేక మంది ఆకర్షితులై భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని 8, 9 వార్డుల కౌన్సిలర్లు శేషగిరి, నర్సింహులు ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ వారి జీవన ప్రమాణాలు పెంచుతూ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజా సంక్షేమంతో పాటు రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పర్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ అనేక పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ, ప్రాజెక్టులతో నీరందించేందుకు కృషి చేస్తూ ఇతర రాష్ట్రాలకు, దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలుపుతున్నారన్నారు. ఇంత అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ పరిపాలనను చూసి నాయకులు, ప్రజలు భారీగా ఆకర్షితులై టీఆర్‌ఎస్‌తోనే అన్ని విధాలుగా అభివృద్ధి సాధ్యపడుతుందని, టీఆర్‌ఎస్‌లో చేరడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షు డు ప్రభాకర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ అ నంత్‌రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సురేశ్, నాయకు లు రమేశ్‌కుమార్, చందర్‌నాయక్, కౌన్సిలర్లు శేషగిరి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...