బాలకేంద్రం..బాలబాలికల వినోద కేంద్రం


Fri,May 17, 2019 11:00 PM

- రాష్ట్రంలో ప్రతిభ చాటుతున్న బాలకేంద్రం
- ఇప్పటి వరకు 15 రాష్ట్ర స్థాయి అవార్డులు
- రూ.50ల రుసుముతో ఏడాదంతా శిక్షణ
- సంప్రదాయ నృత్యాలకు మొగ్గు చూపుతున్న బాలబాలికలు
- తబల, చిత్రలేఖనం, నృత్యం, అల్లికలపై ప్రత్యేక చొరవ

వికారాబాద్ టౌన్ : ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్న ఈ రోజుల్లో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు 36 ఏండ్లుగా పేద, మధ్య తరగతి బాలబాలికల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తున్న ది వికారాబాద్ బా లకేంద్రం. తల్లిదండ్రులు బిజీగా గడుపుతున్న ఈ రోజుల్లో పిల్ల ల ఇష్టాలకనుగుణంగా మార్చేందుకు తల్లిదండ్రు లు ఇష్టపడుతున్నారు. అం దులో భాగంగా పట్టణం నడిబొడ్డున ఉన్న బాలకేంద్రంలో సుమారుగా 200 మంది విద్యార్థులు నృత్యం, చిత్రలేఖనం, తబల , అల్లికలు తదితర అంశాలపై శిక్షణ తీసుకొని వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తున్నారు. వికారాబాద్ బాలకేంద్రంకు వివిధ రం గాల్లో రాష్ట్ర స్థాయిలో 15 వరకు అవార్డులు దక్కించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమం నిర్వహించిన వి కారాబాద్ విద్యార్థులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు.

గత ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసిన ఉగాది పురస్కారాల్లో రవీంద్రభారతిలో మాజీ గవర్నర్ రోశయ్య నుంచి అవార్డును అందుకున్నారు. అంతకు ముందు 2018 ఆగస్టు 15న అప్ప టి కలెక్టర్ సయ్యద్ ఓమర్ జలీల్ విద్యార్థులు చేసిన నృత్యానికి ముగ్దుడై విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు పట్టణాల్లో ని ర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులు ప్రతిభ చాటి అవార్డులను సొంతం చేసుకున్న సంఘటనలు ఉ న్నాయి. 2018 భారతి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో తన్వీ, అర్చన నృత్య ప్రదర్శన చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తే బాలకేంద్రాన్ని బాల భవన్‌గా మార్చి మరింత మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు అవకాశాలు అందించవచ్చని బాలకేంద్రం అధ్యాపకులు వివరిస్తున్నారు. ప్ర త్యేకంగా ఎండకాలంలో ఉదయం 9 నుంచి 12 గం టల వరకు ప్రత్యేక తరగతు లు నిర్వహించి విద్యార్థులు ఎంచుకున్న రంగంలో శిక్షణ ఇస్తున్నారు. రూ.50 ఫీజు చెల్లి స్తే చాలు ఏడాది పాటు బాలకేంద్రంలో శిక్షణ పొందే అవకా శం ఉంది.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...