ఉపాధి కూలి పెంపు


Fri,May 17, 2019 10:59 PM

-రూ.6 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
-జిల్లాలో 1,84,606 మందికి లబ్ధి
-ఈ సంవత్సరం 59,25,691 పనిదినాలే లక్ష్యం
వికారాబాద్, నమస్తే తెలంగాణ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు రూ.6లు పెంచుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో భాగంగా తెలంగాణలో రూ.205 కూలీ ఉండగా రూ.2019-20లో మరో రూ.6లు పెంచడంతో ప్రతి కూలీకి రూ.211లు అయింది. దీంతో వికారాబాద్ జిల్లాలో 1,84 ,606 మంది కుటుంబికులకు లబ్ధి చేకూరనుంది. ప్రతి నిత్యం లక్షకుపైగా ఉపాధి పనుల్లో కూలీలు ప్రతి దినం పనులకు హాజరు అవుతున్నారు. ఈ సంవత్సరం జిల్లాలో 59,25,691 పని దినాలు కల్పించేందుకు అధికారులు లక్ష్యం నిర్వహించి అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. 2018-19 గత సంవత్సరం జిల్లాలో 1,86, 383 మంది ఇంటి యజమానులకు ఉపాధి జాబ్ కార్డులు ఇచ్చారు. 2018-19 సంవత్సరానికి 67,44,649 పని దినాలు కల్పించడం జరిగింది.

మండలాల వారీగా
బంట్వారం 9,679 మంది జాబ్‌కార్డులు, 4,91,510 పని దినాలే లక్ష్యం, బషీరాబాద్ 13,029 జాబ్ కార్డులు, 3,59,905 పని దినాలు లక్ష్యం, బొంరాస్‌పేట 13,393 జాబ్ కార్డులు, 1,77,482 పని దినాలు లక్ష్యం, ధారూరు 11,211 జాబ్ కార్డులు, 5,39,082 పని దినాలు లక్ష్యం, దోమ 10,849 మంది జాబ్‌కార్డులు, 2,76,345 పని దినాలు లక్ష్యం, దౌల్తాబాద్ 11,604 మంది జాబ్‌కార్డులు, 1,91,935 పని దినాలు లక్ష్యం, కొడంగల్ 10,894 జాబ్ కార్డులు, 2,32,328 పని దినాలు లక్ష్యం, కులకచర్ల 15,587 జాబ్ కార్డులు, 4,71,748 పని దినాలు లక్ష్యం, మర్పల్లి 8,936మంది జాబ్ కార్డులు, 4,28,438 పని దినాలు లక్ష్యం, మోమిన్‌పేట 8,605 మంది జాబ్ కార్డులు, 2,96,630 పని దినాలు లక్ష్యం,

నవాబుపేట7,504 మంది జాబ్ కార్డులు, 3,37,251 పని దినాలు లక్ష్యం, పరిగి 12,490 మంది జాబ్ కార్డులు, 2,77,319 పని దినాలు లక్ష్యం, పెద్దేముల్ 11,654 మంది జాబ్ కార్డులు, 5,13, 308 పని దినాలు లక్ష్యం, పూడూరు 10,145 మంది జాబ్ కార్డు లు, 2,90,323 పని దినాలు లక్ష్యం, తాండూరు 10,184 మంది జాబ్ కార్డులు, 2,63,590 పని దినాలు లక్ష్యం, వికారాబాద్ 8,344 మంది జాబ్ కార్డులు, 4,28,255 పని దినాలు లక్ష్యం, యాలాల 10,898 మంది జాబ్ కార్డులు, 3,50,242 పని దినాలు లక్ష్యం ఉంది. మొత్తం 1,84,606 జాబ్ కార్డులకు 59,25,691 పని దినాలను కల్పించడం లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...