ఘనంగా లక్ష్మీనర్సింహస్వామి జయంత్యోత్సవాలు


Fri,May 17, 2019 10:58 PM

మొయినాదబాద్: దేశానికి సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం రావాలని స్వామి వారిని ప్రార్థించామని చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకులు రంగరాజన్ అన్నా రు. మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయం లో గురువారం శ్రీ లక్ష్మీనర్సింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి అభిషేకం చేశారు.సూర్య అస్తమయానికి విశేషమైన ఆరాధన నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులచే నర్సింహాస్వామి నామాన్ని జపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సింహాస్వామి అవతారానికి కథానాయుడు ప్రహ్లాదుడని చెప్పారు. ఎలాంటి కష్టం వచ్చిన ప్రహ్లాదుడు లక్ష్మీనర్సింహస్వామికి ప్రియమైన భక్తుడుగా ఉండి అందరికీ ఆదర్శంగా నిలిచాడని చెప్పవచ్చును. స్వామివారికి అభిషేకం చేసిన సమయంలో ఓ సంకల్పం చేశారు.సంవృద్ధిగా వర్షాలు కురిసి చెరువు లు, కుంటలు నిండాలని, పచ్చని పంటలతో దేశం తులతూగాలని స్వామి వారిని ప్రార్థించడం జరిగిందని పేర్కొన్నారు. రైతులు ఆత్మహత్యలు దేశంలో ఉండకుండ స్వామి వారు చూడాలని వేడుకున్నాము. పరీక్షలు రాసే విద్యార్థుల్లో భయం పోవాలని, వారు ధైర్యంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని స్వామి వారిని ప్రార్థించాము.చిన్న పిల్లల్లో నర్సింహాస్వామి ధైర్యాన్ని నింపాలని కోరడం జరిగిందని చెప్పారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...