104కు సుస్తీ


Fri,May 17, 2019 10:58 PM

- టైర్లు లేక మూడు నెలలుగా మూలన
- ఇబ్బందుల్లో దీర్ఘకాలిక రోగులు..వృద్ధులు
- మరమ్మతులు చేయాలంటున్న ప్రజలు
కొడంగల్, నమస్తే తెలంగాణ : గ్రామ ప్రజలకు ఆరోగ్య ప్రదాయినిగా వెలుగొందుతున్న 104 వైద్య వాహనం మరమ్మతులకు నోచుకోలేక మూడు నెలలుగా మూలన పడిపోయింది. ఆరోగ్యాలను కాపాడే వాహనానికి స్తుస్తి చేసి మూ లన పడితే వైద్య సేవలను ఏ విధంగా చేయించుకోవాలని దీర్ఘకాలిక రోగులు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యాలను కాపాడే వాహనానికే సుస్తీ చేస్తే మరమ్మతులు చేయించే వారే లేరాని గ్రామీణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నెలకొసారి గ్రామానికి వచ్చే 104 వాహనం మూడు నెలలుగా గ్రామానికి రాకపోవడంతో దీర్ఘకాలిక రోగులు వాహ న రాకకోసం ఎదురు చూస్తున్నామని, దీర్ఘ కాలిక రోగులకు నెలసరి మందులు అందుకోలేక అనారోగ్యాల బారిన పతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. 104 వైద్య వాహనంతో గ్రామ ప్రజలు ఆరోగ్యాన్ని కా పాడుకొంటున్నామని, వృద్ధుల కు దీర్ఘకాలిక రోగులకు ఈ వా హన సేవలు ఎంతో ఉపయోగపడుతుందని, మూడు నెలలు గా గ్రామాలకు రాకపోవడంతో వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రా మస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని 104 వైద్య వా హనం ప్రతి రోజూ రెండు గ్రామాలను సందర్శిస్తూ నెలలోని 28 పని దినాల్లో మొత్తం 48 గ్రామాల్లో వైద్య సేవల ను అందిస్తున్నది. ప్రతి రోజుల ఆయా గ్రామాలకు వెళ్లిన 104 వైద్య వాహనం ద్వారా దాదాపు 30 నుంచి 40 మం ది వైద్య పరీక్షలను చేయించుకునే వీలుండేది. అందులో దా దాపు 15 నుంచి 20 వరకు బీపీ, షుగర్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక రోగులు చికిత్సను అందుకొని ఉచితంగా నెలకు సరిపడా మందులను అందుకొని ఆరోగ్యాన్ని కాపాడుకొం టూ వస్తున్నారు.

వాహనానికి టైర్లు లేని కారణంగా మూడు నెలల కాలం గా మూలన పడడం చాలా బాధాకరమని, ప్రజారోగ్యాలను దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడే 104 వాహనాన్ని త్వరగా మరమ్మతులు చేసి గ్రామాలకు పంపించి ఆరోగ్యాలను కాపాడాలని కోరుతున్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...