ప్రతిభకు సన్మానం


Thu,May 16, 2019 11:31 PM

- ప్రతిభను వెలికి తీయడమే ఉపాధ్యాయుల కర్తవ్యం
- ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
- కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా
వికారాబాద్ టౌన్ : ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని, దానిని గుర్తించి వెలికి తీసినప్పుడే వారికి గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా తెలిపారు. గురువారం పట్టణంలోని డైట్ కళాశాలలో గాంధీ హాల్‌లో 10వ తరగతిలో 10/10 గ్రేడ్ సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను, 100 శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలల ప్ర ధానోపాధ్యాయుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగశాలలు, గ్రంథాలయాలు తదితర సౌకర్యా లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యా లు ఉన్నాయన్నారు. వీటిని విద్యార్థులు, ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి ఈ ఫలితాలు నిదర్శణం అన్నారు. జిల్లాలో 26 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషంగా ఉంది.

నలుగురు విద్యార్థులు 10/ 10 గ్రేడ్ సాధించడంలో విద్యార్థుల కృషి ఎంతో ఉందన్నారు. గత ఏడాది రాష్ట్రంలో జిల్లా 29వ స్థానంలో నిలువగా ఈ సారి 25వ స్థానానికి రావడంతో విద్యారంగంలో మెరుగు పడిందన్నారు. విద్యార్థులు విద్యతో పాటు శారీరక, మానసిక ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. విద్యార్థులు ముందుగా ప్రణాళికను ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా విద్యనభ్యసించాలన్నా రు. ఈ సందర్భంగా డీఈవో రేణుకాదేవి మాట్లాడుతూ 45 రోజుల ప్రణాళిక పరంగా విద్యార్థులను చదివించడం జరిగిందన్నారు. సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో విద్యార్థులకు స్య్నాక్స్ అందించేందుకు కలెక్టర్ రూ.25లక్షలు కేటాయించడం సంతోషించదగ్గ విషయమన్నారు. కలెక్టర్ ప్రో త్సాహం విద్యాశాఖకు అందించాలని విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంలో తోడ్పాటు నందిస్తామన్నారు. అనంతరం 10/10 గ్రేడ్ సాధించిన విద్యార్థులను, 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి, బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల జిల్లా అధికారులు, ఆయా మండలాల ఎం ఈవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
మోమిన్‌పేట : మండల పరిధిలోని టేకులపల్లి పాఠశాలలో 10వ తరగతిలో 26 మంది విద్యార్థులకు గాను 26 మంది వి ద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో పాఠశాల వందశాతం ఫలితాలు సాధించింది. విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడు సమ్మయ్యతో పాటు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు మంచి విద్యను అందించినందుకే ఇలాంటి ఫలితాలు సాధించగలిగామని ప్రధానోపాద్యాయుడు సమ్మయ్య తెలిపారు. కలెక్టర్ నుంచి ఘనసన్మనం పొందామన్నారు. వచ్చే సంవత్సరం కూడా మంచి ఫలితాలు సాధిస్తామని ఆయన తెలిపారు.

ప్రధానోపాధ్యాయులకు సన్మానం
బషీరాబాద్ : పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కలెక్టర్ సన్మానం చేశారు. మండలంలో మొత్తం 12 ఉన్నత పాఠశాలలు, ఒక ఉ ర్దూ మీడియం పాఠశాల ఉంది. అందులో 5 ఉన్నత పాఠశాల లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. అందులో రెండు ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు కాగా, మూడు తెలుగు మీడియం పాఠశాలలు ఉన్నాయి.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...