మరుగుదొడ్ల నిర్మాణాలు జూన్ 2 లోగా పూర్తి చేయాలి


Thu,May 16, 2019 11:30 PM

వికారాబాద్ టౌన్ : స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి గ్రామంలో మరుగుదొడ్ల ని ర్మాణ పనులు జూన్ 2 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో అన్ని మండలాల ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌డీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులందరూ మరుగుదొడ్ల నిర్మాణ పనులపై పూర్తి సమయం కేటాయించి మార్కింగ్‌లు వేసి గుంతలు తీసి బేస్మిట్లు కట్టించాలని సూచించారు. మి గులు నిధులను వెచ్చించి అవసరమైన నిర్మాణ సామగ్రిని తెప్పించి యుద్ధ ప్రతిపాదికన పనులు త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు, మండల స్థాయి అధికారులు ఈ పనులపై దృష్టి సారించి నిర్మాణాలు పూర్తి ఓడీఎఫ్‌గా ప్రకటించాల్సి ఉండగా, పనులు పూర్తి కానందు వల్ల త్వర గా పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. ల క్ష్యానికి అతి దగ్గరగా ఉన్న మండలాలు వికారాబాద్, మోమిన్‌పేట, పూడూరు, నవాబుపేట మండలాలు మిగిలి ఉన్న చిన్న లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ప్రతి రోజు జరిగిన పనులపై సాయంత్రం నివేదికలు అందజేయాలన్నారు. వారానికి రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతిని తెలుసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీవో జాన్సన్ పాల్గొన్నారు.


మండలాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటన చేయాలి
మోమిన్‌పేట : ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా మార్చుకోవాలని, ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని జిల్లా డీఆర్‌డీఏ పీడీ జాన్సన్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ కార్యదర్శులకు, రెవెన్యూ కార్యదర్శులకు, ఆశ వర్కర్లు, ఐకేసీ సిబ్బందికి, పీవోలు, ఏపీవోలు, అంగన్‌వాడీ టీచర్లకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వం జూన్ 2వ తేదీ వరకు అవకాశం కల్పించిదని ఆ లోపు ప్రతి గ్రామాన్ని ఓడీఎఫ్‌గా డిక్లర్ చేసి మండలాన్ని, జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించుకోవాలని పేర్కొన్నారు. గ్రామంలో మరుగుదొడ్డి నిర్మించుకుని వారి ఇంటికి వెళ్లి నిర్మించుకునేలా చూడాలన్నారు. నిర్మించుకున్న లబ్ధిదారులకు త్వరగా డబ్బులు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శైలజారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రవీంద్రదత్తు, ఏఈ న యనశ్రీ, ఈవోపీఆర్డీ లక్ష్మి, సూపరింటెండెంట్ శాంత, పశువైద్యాధికారి అన్వేష్, ఏవో రాధారెడ్డి, జిల్లా స్వచ్ఛ మిషన్ కార్యదర్శి లక్ష్మి పాల్గొన్నారు.

నిర్మాణ పనులు ఉద్యమంలా సాగాలి
నవాబుపేట :ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం కచ్చితంగా ఉండాలని అందుకోసం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారులందరూ కృషి చేయాలని డీఆర్‌డీఏ పీడీ జాన్సన్ అన్నారు. మండల కార్యాలయంలో అంగన్‌వాడీ, ఆశ వర్క ర్లు, ఉపాధి హామీ టీఏలు, ఎఫ్‌ఏలు, గ్రామ కార్యదర్శులు, వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్డి నిర్మా ణంపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి అనివార్యమనే నినాదాన్ని బలోపేతం చేస్తూ ప్రజలను చైతన్యం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్, ఎంపీడీవో సుమిత్రమ్మ, ఈవోఆర్డీ అనిత, ఏపీవో లక్ష్మి, టీఏలు పాల్గొన్నారు.

మొక్కలను సక్రమంగా పెంచాలి

పూడూరు : గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో సక్రమంగా మొక్కలు పెంచి సంరక్షించకుంటే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని డీఆర్‌డీఏ జాన్సన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో మండల స్థాయి నర్సరీల ఏర్పాట్లపై, మొక్కల సంరక్షణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రా మానికి ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేసేలా మొక్కలను పెంచాలని తెలిపారు. నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలన్నారు. ఎన్‌ఆర్‌ఈజీ నుంచి రైతుల పొలా ల్లో మొక్కలు నాటేందుకు గాను కూలీలచే గుంతలను తీయించాలని వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉషా, తహసీల్దార్ వహీద ఖాతున్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఏపీఎం, ఏపీవో, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...