ప్రతిపాదనలకే పరిమితమైన ఎన్కేపల్లి రోడ్డు


Thu,May 16, 2019 11:26 PM

-కంకరతేలి నడువలేని దుస్థితిలో రహదారి
-సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు
-ప్రమాదాల బారిన వాహనదారులు
బంట్వారం: కొన్ని సంవత్సరాలుగా కంకర తేలి నడువలేని స్థితిలో ఉన్న పీఆర్ రోడ్డును అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు వాపోతున్నారు. ప్రతి రోజూ ఈ రోడ్డుపై బైక్‌పై వెళితే ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకుంటుందని, ఇంతటి దుస్థితిలో ఉన్న రోడ్డు నిర్మాణం పట్ల స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. కోట్‌పల్లి మండల పరిధిలోని ఎన్కేపల్లి-జిన్నారం గేట్ వరకు ఉన్న 2.5 కిలోమీటర్ల రోడ్డు నేడు కంకర తేలి, గోతులు పడి కనీసం నడువడానికి కూడా కష్టంగా ఉంది. కోట్‌పల్లి, బంట్వారం, మర్పల్లి మండలాల ప్రజలు వికారాబాద్ వెళ్లాలన్న ఈ రోడ్డునే ఎంచుకొంటారు. ఇందుకు ప్రధానంగా ఈ రోడ్డు గుండా వెళితే వికారాబాద్ 29 కిలో మీటర్ల దూరం అవుతుంది. ఇతర మార్గాలైన కోట్‌పల్లి, రాంపూర్ మీదుగా వెళితే అదనంగా 8 కిలోమీటర్లు, అదే బార్వాద్, మోత్కుపల్లి మీదుగా వెళితే 6 కిలోమీటర్లు ఎక్కువైతుంది. ఈ కారణంగా ప్రజలు మండల కేంద్రం నుంచి వికారాబాద్ వెళ్లాలన్న ఎన్కేపల్లి-జిన్నారం గేట్ రోడ్డు గుండానే వెళుతుంటారు. అంతే కాక వికారాబాద్ నుంచి వచ్చే పలు ప్రభుత్వ శాఖాధికారులు ఇదే రోడ్డు ద్వారా మండల కేంద్రానికి ప్రతి రోజూ వస్తుంటారు. వీరంతా ప్రతి రోజూ బైక్‌లపై వస్తుండండతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాత్రుల్లో మాత్రం వెళుతుంటే రోడ్డు సక్రమంగా కనిపించక పలుమార్లు ప్రమాదాలు జరిగిన సంఘటనలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో రూ.10లక్షలు మంజూరు
ఈ రోడ్డు నిర్మాణానికి గాను 2013-14 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటల్ రోడ్డు నిర్మాణానికి గాను రూ.10 లక్షలను మంజూరు చేసింది. అయిన అప్పటి అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల పట్టింపు లేక రోడ్డు నిర్మాణం మాత్రం జరుగలేదు. నాలగు సంవత్సరాల క్రితం మాత్రం 1 కిలోమీటరు మాత్రం మెటలింగ్ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. అయితే వేసిన మెటల్ రోడ్డు 8 నెలలకే కంకర తేలి వాహనాలు తిరుగలేని స్థితికి చేరింది. కంకర తేలిన రోడ్డు గురించి అధికారులు పట్టించుకోలేదు. వెంటనే కంకర తేలిన చోట తిరిగి మట్టిపోసిన కొంతవరకు బాగుండేదని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బీటి రోడ్డుగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...