ఘనంగా సీతారామచంద్రస్వామి కల్యాణం


Thu,May 16, 2019 11:25 PM

శామీర్‌పేట: శ్రీరామభద్ర క్షేత్రంలో శ్రీసీతారామచంద్రస్వామివారి శాంతి కల్యాణంతో అత్యంత భక్తి శ్రద్ధ్దలతో కన్నుల పండగగా జరిగింది. దేవాలయం ద్వితియ వార్షికోత్సవ పూజా కార్యక్రమాల్లో భాగంగా గురువారం దేవాలయంలో కల్యాణంతో పాటు మహాపూర్ణాహుతి, చక్రస్నానము, సాయంత్రం ఉత్సవ మూర్తులకు పల్లకీ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా హనుమాన్ దేవాలయం వద్ద రావిచెట్టు క్రింద నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన చేపట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పూర్ణాహుతి సందర్భంగా భక్తుల ధర్మ సందేహాలు తీర్చే బ్రహ్మశ్రీ దేవిశ్రీ గురూజీ, సంస్కృత సోదరులు కొడవగంటి మహాదేవశర్మ, శ్రీనాథశర్మ, మధునూరి వెంకటరామశర్మ, దివ్యజ్ఞాణ సిద్దాంతి కడకండ్ల రామకృష్ణశర్మలు సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...