కిచెన్‌షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యేనా?


Wed,May 15, 2019 11:12 PM

-తీరని వంటగదుల సమస్యలు
-ఇబ్బందులు పడుతున్న మధ్యాహ్న భోజన నిర్వాహకులు
-మంజూరై సంవత్సరం అవుతున్నా ఇంకా పూర్తికాని వంటగదులు
కులకచర్ల:పాఠశాలల్లో కిచెన్‌షెడ్ల సమస్యలను తొలగించేందుకు తెలంగాణ ప్రభు త్వం చర్యలు చేపట్టి సంవత్సరం పూర్తైనా ఇప్పటివరకు వాటిని పూర్తి చేయకపోవడంతో మధ్యాహ్నభోజనం అందించే నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల్లో కిచెన్‌షెడ్లు లేక మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రభుత్వం మధ్యాహ్నభోజన నిర్వాహకుల ఇబ్బందులు తొలగించేందుకు వంటగదులు నిర్మించేందుకు ప్రభుత్వం గత సంవత్సరం నిధులు మంజూరు చేసిం ది. దీనిలో భాగంగానే కులకచర్ల మండలానికి మొదటి దళలోనే 28 పాఠశాల్లో వంటగదుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఒక్కో వంటగది నిర్మాణానికి 2 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. మండలంలో 72 ప్రాథమిక, ప్రథమికోన్నత పాఠశాలలు, 13 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మండలంలో కొన్ని పాఠశాలల్లో మాత్రమే వంట గదులు ఉండగా మిగితా పాఠశాలల్లో వంట గదులు లేక మధ్యాహ్నభోజన నిర్వాహకులు ఇబ్బందులు పడేవారు. వంటగదులు లేక పాఠశాలలో చెట్లకింద, రేకుల కింద కట్టెలతో ఒంట చేస్తూ గాలి, వానకు అవస్థలు పడేవారు. పాఠశాలల్లో మధ్యాహ్నభోజన నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించి వంటగదుల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. కానీ ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరై సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు కాం ట్రాక్టర్లు వాటి నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిస్థాయిలో నెరవేరలేక పోయిందని పలువురు పేర్కొంటున్నారు.

28 వంట గదులు మంజూరై సంవత్సరమైనా ప్రారంభం కాలేదు
మండలంలో మొదటి విడుతగా 28 పాఠశాలలకు వంటగదుల నిర్మాణాలకు నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు నిర్మాణాలు మాత్రం పూర్తిగా కాలేదు. 20 వంటగదులు మాత్రం నిర్మాణాలు స్లాబు వేసి నిధులు రాలేదని నిర్మాణం ఆపేవేశారు. మండల పరిధిలోని ముజాహిద్‌పూర్ ఉన్నత పాఠశాల, సాల్వీడ్ ఉన్నత పాఠశాల, అనంతసాగర్ ప్రాథమిక పాఠశాల, రాంరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో అల్లాపూర్, రాంరెడ్డిపల్లి, చాకల్‌పల్లితండా,బోయకొటాలు, అడవివెంకటాపూర్ గ్రామ పంచాయతీలో బజ్జనాయక్‌తండా, సక్య్రనాయక్‌తండా, గోగ్యనాయక్‌తండా, అడవివెంకటాపూర్, కులకచర్ల గ్రామ పంచాయతీలో భోజ్యానాయక్‌తండా, కుస్మసముద్రం గ్రామ పం చాయతీలో గోరిగడ్డతండా, గట్టనపల్లి, చెరువుముందలితండాకు 2. తిర్మలాపూర్ గ్రామ పంచాయతీలో బండమీది తండా, జీతులతండా, ముజాహిద్‌పూర్ గ్రామ పంచాయతీలో దాస్యనాయక్‌తండా, సందనిగడ్డ, పోటిగడ్డతండా, అంతారం పంచాయతీలో బండమీదితండా, చింతల్‌కుంట తండా, రాంనగర్, చౌడాపూర్ గ్రామ పంచాయతీలో పాచ్చావ్‌కుంటతండా, హన్మాయపల్లి, కామునిపల్లి గ్రామ పంచాయతీలోని బోజ్యనాయక్‌తండా పాఠశాలల నిర్మాణానికి 2లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. కానీ నిర్మాణాలు మాత్రం పూర్తికాలేదు. గత సంవత్సరం ఎండాకాలంలో ప్రారంభమైన వంటగదుల నిర్మాణాలు పాఠశాలలు తెరిచేవరకు పూర్తిచేయాలని తెలియజేసినా పాఠశాలలు ప్రారంభమై తరువాత మళ్లీ వేసవి కాలం వచ్చినా నిర్మాణాలు పూర్తికాలేదు.

ఈ విద్యా సంవత్సరంలోనైనా పూర్తి అయ్యేనా...?
కులకచర్ల మండల పరిధిలోని పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న కిచెన్‌షెడ్ల నిర్మాణాలు ఈ విద్యా సంవత్సరానికైనా నిర్మాణాలు పూర్తయ్యేనా అని పలుగ్రామాల మధ్యాహ్న భోజన నిర్వాహకులు పేర్కొంటున్నారు. రెండు సంవత్సరాలుగా కిచెన్‌షెడ్ల నిర్మాణాలు కొనసాగుతున్న కాంట్రాక్టర్లు మాత్రం వాటిని ఇప్పటి వరకు పూర్తిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు పేర్కొంటున్నారు. కిచెన్‌షెడ్ల నిర్మాణాలు పూర్తి చేసి తమ ఇబ్బందులు తొలగించాలని పలువురు వంట నిర్వాహకులు కోరుతున్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...