పత్తి, మొక్కజొన్న పంటలపై రైతుల ఆసక్తి


Wed,May 15, 2019 11:08 PM

-రెండు రకాల చీడ పురుగులతో నష్టం
-నకిలీ విత్తనాలు విక్రయించకుండా చర్యలు
-రెవెన్యూ, పోలీస్ సిబ్బంది నిఘా ఏర్పాటు
-కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా
వికారాబాద్ టౌన్ : జిల్లాలోని రైతులు పత్తి, మొక్కజొన్న పంటలను ఆసక్తిగా పండిస్తున్నారని కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హా ల్‌లో పత్తి, మొక్కజొన్న సాగు పంటలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పత్తి, మొక్కజొన్న పంటలపై రెండు రకాల చీడ పురుగులతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో వీటి బారి నుంచి పంట నష్టపోకుండా రైతులకు సూచనలు, సలహాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతులతో పాటు రైతు సమన్వయ సభ్యులు, పత్తి, మొక్కజొన్న కొనుగోలు చేసేవారికి కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించకుండా వ్యవసాయాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది నిఘాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. రైతులు లైసెన్సులు ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేసి వారి వద్ద నుంచి రసీదు పొందాలని ఆమె సూచించారు. వచ్చే ఏడాది పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, దీని పండించే పద్ధతులను వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా రైతులు అవగాహన పొందాలన్నారు. ఈ పురు గు గత రెండేండ్లుగా బీటీ పత్తిని ఆశించి నష్టపరుస్తుందన్నారు. గులాబీ రంగు పురుగు వల్ల జరిగే నష్టంపైకి కనబడదని, కాయ లు పగిలినప్పుడు మాత్రమే తెలుస్తుందని ఆమె తెలిపారు. ఇలా ంటి కొన్ని మెళకువలు అధికారులను అడిగి తెలుసుకుంటే రైతు లు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు. పంటలకు పిచికారీ చేసే రసాయనాలు వారి నేలకు తగ్గట్లుగా అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ రైతులు సాగు చేసుకోవాలని సూచించారు. తక్కువ కాల పరిమితి రకాల పంటలు ఎంచుకొ ని సకాలంలో పండించుకోవాలన్నారు. బీటి పత్తి విత్తనం చు ట్టూ ఐదు వరుసల్లో, నాన్ బీటీ పత్తి విత్తనాలను సాగు చేసుకోవాలన్నారు. పత్తి మొక్క భాగంలో కలుపు లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి గోపాల్, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

మహిళలు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి
మహిళలు ఇండ్లతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉం చుకొని పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ పేర్కొన్నా రు. పట్టణంలోని 5 వార్డు ఆలంపల్లిలో డ్వాక్రా సంఘాలు, కాల నీ మహిళలతో పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఉంచినైట్లెతే మున్సిపల్ సిబ్బంది వచ్చి తీసుకెళ్తారన్నారు. తడి చెత్తను ఎరువుగా, పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడానికి ఉపయోగిస్తారని ఆమె తెలిపారు. విదేశాల్లో చెత్త సేకరణ కొరకు ప్రభుత్వం ప్రజల నుంచి డబ్బులు వసులు చేస్తుందని, మన దేశంలో ఎలాంటి రుసుములు లేకుండా మున్సిపల్ సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి చెత్తను సేకరించడం జరుగుతుందన్నారు. డ్వాక్రా గ్రూపు మహిళలు కాలనీల్లో, గ్రామాల్లో అవగాహన నిర్వహించి ప్రతి మహిళ ఇంట్లో రెండు చెత్త బుట్టలు ఉంచుకోవాలన్నారు. ఒక బుట్టలో వంటింటి తడి చెత్త, మరో బుట్టలో ప్లాస్టిక్, నిరూపయోగమైనవి వేసుకోవాలన్నారు. చెత్తను రోడ్లపై ఇష్టానుసారంగా పారవేయకూడదన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయడం వల్ల దోమలు, ఈగలు వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. అనంతరం 5వ వార్డులో డ్వాక్రా మహిళ భవనం నిర్మించాలని మహిళలు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, టౌన్ మిషన్ కో ఆర్డినేటర్ వెంకటేశం పాల్గొన్నారు.

పాసుపుస్తకాల పనులను పూర్తి చేయాలి
అన్ని మండల తహసీల్దార్లు సాధ్యమైనంత త్వరలో పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాల పనులను పూర్తి చేసి రైతులకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆర్డీవో, ఆయా మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ మ్యుటేషన్, విరాసత్ పనులు వెంటనే పూర్తి చేసి పాసుపుస్తకాలు రైతులకు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పూర్తి అయిన పాసుపుస్తకాల పనులకు డిజీటల్ సంతకాలు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. అన్ని మున్సిపాలిటీల్లో అవసరమైన డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల కోసం స్థలాలను గుర్తించి సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మిలకు సంబంధించిన నిధులు విడుదల అయినందునా తహసీల్దార్లు లబ్ధిదారులను గుర్తించి విచారణ చేసి ఆర్డీవోలకు పంపి లబ్ధిదారులకు నిధులు అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీవో మోతీలాల్, వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు విశ్వనాథం, వేణుమాధవరావులతో పాటు ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...