చించోలి ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకుంటాం


Wed,May 15, 2019 12:03 AM

-కర్ణాటక రాష్ట్ర బీజేపీ కార్యదర్శి భారతి ముక్దుమ్‌
-తాండూరుకు మాజీ సీఎం యడ్యూరప్ప రాక
తాండూరు రూరల్‌: కర్ణాటకలో జరుగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కర్ణాటక రాష్ట్ర బీజేపీ కార్యదర్శి భారతి ముక్దుమ్‌, కలబురిగి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, బీజేపీ సీనియర్‌ నాయకుడు విద్యాసాగర్‌ కులకర్ణిలు స్పష్టం చేశారు. తెలంగాణ సరిహద్దులో ఉన్న చించోలి తాలుక ఎమ్మెల్యే స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తాండూరులో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్ణాటకలో చించోలి, కుందుగోల్‌ నియోజకర్గాల్లోని ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ రెండు స్థానాల్లో బీజేపీ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని తాండూరు నియోజకర్గ సరిహధ్దులో ఉన్న చించోలి నియోజకర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ అవినాస్‌ జాదవ్‌ గెలుపు కోసం పలు ప్రాంతాల్లో మాజీ సీఎం యడ్యూరప్ప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని వారు తెలిపారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు తాండూరుకు చేరుకుంటారని, అనంతరం తాండూరులోని భావిగి భద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. అక్కడి నుంచి కుంచవరం ప్రాంతంలో మాజీ సీఎం రోడ్‌షో నిర్వహించున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారని వారు తెలిపారు.
అదేవిధంగా చించోలి, మిరియానంలోని మైనింగ్‌ కార్మికులంతోపాటు యాజమానులతో కూడా మాజీ సీఎం మాట్లాడతారన్నారు. మాజీ సీఎం వెంట మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప, ఎమ్మెల్యే సోమన్న, ఎమ్మెల్సీ రవికుమార్‌, తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, మాజీ మంత్రి బాబుమోహన్‌లు కూడా ఉంటారన్నారు. ఈ నెల 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయని వారు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రవిచంద్రకులకర్ణి, శ్యామ్‌ప్రసాద్‌, లింగరాజ తదితరులు ఉన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...