యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలి


Wed,May 15, 2019 12:03 AM

తాండూరు రూరల్‌: యుద్ధ ప్రాతిపదినక గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేయాలని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ జాన్సన్‌ సూచించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలంయలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలు, ఫీల్డ్‌అసిస్టెంట్స్‌, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి మండలంలోని 33 పంచాయతీల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసి, తాండూరు మండలాన్నీ సంపూర్ణ ఓడీఎఫ్‌ మండలంగా చేసేందుకు కృషి చేయాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లా 33వ స్థానంలో ఉందని, పక్క జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో మెరుగ్గా ఉందన్నారు. అధికారుల సమస్వయ లోపం కారణంగా జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తికావడంలేదని తెలిపారు. కార్యక్రమం పూర్తి కావాలంటే వీవోలు, సీసీలు, అంగన్‌వాడీ టీచర్లు, వీఆర్‌వోలు, వీఏవోలు సంయుక్తంగా పని చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణానికి కన్‌స్ట్రక్సన్‌ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కమిటీలో సర్పంచ్‌, ఉపసర్పంచు, వీఏవో, వార్డు సభ్యులతోపాటు ఇతరులు కూడా ఉంటారని తెలిపారు. సమయం తక్కువగా ఉందని, ఖచ్చితంగా ఓడీఎఫ్‌ మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు.
స్థలం సరిపోక ఇబ్బంది పడ్డ సిబ్బంది
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించగా, స్థలం సరిపోక కొంత మది వీఆర్‌వోలు, వీఏవోలు హాల్‌ బయట కూర్చోవాల్సి వచ్చింది. పీడీ చెప్పిన సూచనలు, సలహాలు, మాటలు వారికి ఏ మాత్రం వినబడలేదు. కార్యక్రమంలో ఏపీడీ వేణుగోపాల్‌ గుప్తా, ఎంపీడీవో లక్ష్మప్ప, ఎంఈవో వెంకటయ్య, ఐసీడీఎస్‌ సీడీపీవో రేణుక ఉన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...