జూన్‌ నాటికి ప్రతి గ్రామాన్ని ఓడీఎఫ్‌ గా మార్చాలి


Wed,May 15, 2019 12:03 AM

యాలాల: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రతి గ్రామాన్ని జూన్‌ 1 నాటికి ఓడీఎఫ్‌ గ్రామాలుగా మార్చాలని డీఆర్‌డీఏ పీడీ జాన్సన్‌ అన్నారు. మంగళవారం యాలాల మండల పరిషత్‌ కార్యాలయములో ఏర్పాటు చేసిన సమావేశంలోఆయన మాట్లాడారు. గ్రామాల్లో నూర శాతం బహిరంగ మలవిసర్జన గ్రామాలుగా మార్చేందుకు వివిద శాఖల అదికారులతో సమావేషమయ్యారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణంలో ఐకేపీ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సూచించారు. గత నాలుగేండ్లలో పూర్తి చేయని పనులను 15 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. అందుకు ఐకేపి సిబ్బంది, అంగన్‌డవాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, క్షేత్రసహాయకులు, పంచాయతీ కార్యదర్శులు,రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలని అన్నారు. ఒక్కో మరుగుదొడ్డికి రూ.12 వేలను ప్రభుత్వం గిఫ్టుగా ఇస్తున్నదని అన్నారు. మండలంలో ని 24 గ్రామ పంచాయతీలలో 4,689 మరుగుదొడ్లను నిర్మాణము చేయవలసి వుందన్నారు. మరుగుదొడ్ల నిర్మాణములో ఎక్కువగా మహిళల భాగస్వామ్యము ఉండేలా చాడాలని, ఇది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించినదని అన్నారు . ఎంపీడీవో నీరజ, తహసీల్దార్‌ మల్లేశ్‌కుమార్‌, ఏవో స్వప్నప్రియ, ఎంఈవో సుధాకర్‌రెడ్డి, ఏపీవో జనార్దన్‌,ఏఈ రాంప్రసాద్‌రెడ్డి,అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇద్దరు క్షేత్రసహాయకుల సస్పెండ్‌
కేంద్రంలోని యాలాల నర్సరీని, విశ్వనాథ్పూర్‌ నర్సరీలను పీడి జాన్సన్‌ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రెండు నర్సరీల నిర్వహణ బాగా లేనందున యాలాల, విశ్వనాథ్‌పూర్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌ చేశారు. ఏపీవో జనార్దన్‌ , టీఏ శ్రీధర్‌లకు షోకాజ్‌ నోటీసులను జారీచేశారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...