సంపూర్ణ పారిశుద్ధ్య మండలంగా చేద్దాం


Wed,May 15, 2019 12:03 AM

బషీరాబాద్‌: సమన్వయంతో పనిచేసి మండలాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య మండలంగా చేద్దమని జిల్లా రూరల్‌ అభివృద్ధి అధికారి(డీఆర్‌డీవో) జాన్సన్‌ పేర్కొంన్నారు. మండల కేంద్రం బషీరాబాద్‌లోని కృష్ణ మందిన్‌ పంక్షన్‌హాల్‌లో మంగళవారం ఐకేపీ, అంగన్‌వాడీ, ఉపాధి హామీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, రెవున్యూ, పంచాయతీ, ప్రజారోగ్య, విధ్యుత్‌ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండు దఫాలుగా ఓడీఎఫ్‌ మండలంగా చేయాలని అవకాశం ఇస్తే లక్ష్యం పూర్తి చేయలేకపోయారని గుర్తు చేశారు. ఈ ధఫా అలాకాకుండా జూన్‌ 2 నాటికి ప్రతి గ్రామంలో వంద శాతం పూర్తి చేయాలని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లా చాలా వెనుకబడి పోయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓడీఏఫ్‌ మండల ప్రత్యేకాధికారి రవికుమార్‌, తహసీల్ధార్‌ ఉమామహేశ్వరి, ఎంపీడీవో అనురాధ, ఏపీడీ వేణుగోపాల్‌గుప్తా, ఈవోఆర్డి ఉమాదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...