రెండు నెలల్లో పూర్తి చేయాలి


Wed,May 15, 2019 12:03 AM

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణ పనుల్లో త్వరిత గతిన పురోగతి సాధించి రాబోయే 60రోజుల్లో జిల్లాను ఓడిఎఫ్‌గా మార్చాలని జిల్లా కలెక్టర్‌ మస్రత్‌ఖానమ్‌ఆయేషా అధికారులను ఆదేశించారు. మంగళవారం వికారాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి మండలాల ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణ పనులు మొదలు కాని ప్రాంతాలలో వెంటనే పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రారంభమైన వాటికి వెంటనే నిధులు మంజూరు చేయాలని ఎంపీడీవోలకు కలెక్టర్‌ సూచించారు. ప్రతి రోజు ఫీల్డ్‌ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించి మరుగుదొడ్ల నిర్మాణ పనుల్లో పురోగతి సాధించి త్వరిత గతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రతి రోజు వెయ్యి మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టి 60 రోజుల్లో 60వేల మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టి జిల్లాను ఓడిఎఫ్‌గా ప్రకటించాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులకు సంబంధించి మార్కింగ్‌లు, గుంతలు, బేస్మిట్‌ వివరాలను తెలియజేయాలని కలెక్టర్‌ సూచించారు. అలాగే ప్రతి రోజు చేపట్టి పనుల వివరాల నివేదికను సాయంత్రం 4 గంటల వరకు రిపోర్ట్‌ పంపాలని ఎంపీడీవోలకు కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో జాన్సన్‌, వివిధ మండలాల ఎంపీడీవోలు, తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...