శ్రీవారిని దర్శించుకున్న సినీనటి జయప్రద


Wed,May 15, 2019 12:02 AM

మొయినాబాద్‌ : ప్రముఖ సినీనటి, ఎంపీ అభ్యర్థి జయప్రద చిలుకూరు బాలాజీని దర్శించుకున్నారు. మంగళవారం మండల పరిధిలోని చిలుకూరు గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామిని తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షణలు చేసింది. స్వామి వారిని దర్శించుకున్న తరువాత తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ కన్వీనర్‌, ఆలయ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణస్వామి వారికి ప్రత్యేక పూజ లు చేయించారు.స్వామివారి మెడలోని పూల హారతి వారికి వేసి ఆశీర్వదించారు. ఎంపీగా గెలుపొందిన తరువాత 108 ప్రదక్షణలు చేసి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటానని తెలిపారు. ఆమెతో పాటు తన కుమారుడు సిద్దార్థ, కూతురు ప్రవళిక, అక్క సౌందర్యలు ఉన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...