ఓటు వేసేందుకు బిక్కరెడ్డిగూడ గ్రామస్తులు నిరాకరణ


Wed,May 15, 2019 12:02 AM

మోమిన్‌పేట్‌ అనుబంధ గ్రామంగా కొనసాగించాలి
చంద్రాన్‌పల్లికి వెళ్లాలంటే మోమిన్‌పేటకు వచ్చి వెళ్లాలి
రోడ్డు, తాగునీరు కల్పించాలని గ్రామస్తుల డిమాండ్‌
సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు చెప్పడంతో
ఓటు వేసేందుకు వెళ్లిన బిక్కరెడ్డిగూడ గ్రామస్తులు
మోమిన్‌పేట : మోమిన్‌పేట మండల కేంద్రానికి అనుసంధానంగా ఉన్న గ్రామాన్ని చంద్రాప్‌ల్లి గ్రామానికి అనుసంధానం చేయడంతో చంద్రాన్‌పల్లి గ్రామానికి వెళ్లేందుకు మాకు చాలా దూరమైతుందని బిక్కరెడ్డిగూడ గ్రామాన్ని మోమిన్‌పేట గ్రామానికి అనుసంధానం చేయాలని కోరుతూ మంగళవారం బిక్కరెడ్డిగూడ గ్రామస్తులు మూడో విడుత పరిషత్‌ ఎన్నికల్లో ఓటు వేసేందుకు నిరాకరించారు. ఇది తెలుసుకున్న అధికారులు గ్రామానికి వెళ్లి గ్రామస్తుల సమస్యలు తెలుసుకొని మీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామని మా గ్రామాన్ని మోమిన్‌పేటలో ఉంచాలని లికిపూర్వకంగా గ్రామస్తుల సంతకాలతో కూడి పత్రాన్ని తీసుకొని కలెక్టర్‌కు పంపిస్తామని అధికారులు విన్నవించారు. గ్రామంలో తాగునీరు, రోడ్డు వసతి బాగా లేదని ఏండ్ల నాటి నుంచి మా గ్రామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఎన్నికల సమయంలో వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడం తప్పా మా గ్రామాన్ని అభివృద్ధి చేయడం లేదని మాకు హామీ ఇచ్చేంత వరకు ఓటు వేయమని చెప్పడంతో ఎంపీడీఓ వైలజారెడ్డి, ఈఓపీఆర్‌ లక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్‌ రవీంద్రదత్తు, పరిగి డీఎస్పీ రవీంద్రరెడ్డి కలిసి మీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామని గ్రామాన్ని మెమిన్‌పేట అనుబంధ గ్రామంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని మీ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా చూస్తామని చెప్పడంతో గ్రామస్తులు ఓటు వేసేందుకు తరలివెళ్లారు. బిక్కరెడ్డిగూ గ్రామంలో 84మంది ఓటర్లు ఉండగా 200పైగా జనాభా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...