స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి


Wed,May 15, 2019 12:02 AM

-8 నామినేషన్లు దాఖలు
అట్టహాసంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహేందర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు
హాజరైన మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌
ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి,నరేందర్‌రెడ్డి,
చేవెళ్ల టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి,పలువురు నేతలు
రంగారెడ్డిజిల్లా, నమస్తేతెలంగాణ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల గడువు మంగళవారంతో ముగిసింది.చివరి రోజు 7నామినేషన్లు దాఖలు అయ్యాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ తరపున కే.ఉదయ్‌మోహన్‌రెడ్డి, కే.ప్రతాప్‌రెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, శ్రమజీవి పార్టీ తరపునజాజుల భాస్కర్‌లు నామినేషన్లు దాఖలు చేసిన్నట్లు జేసీ హరీశ్‌ తెలిపారు. మొత్తం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 8 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు.

అట్టహాసంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామినేషన్‌..
టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున నామినేషన్‌ దాఖలు చేసిన మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వెంట జిల్లా మంత్రులు చామాకుర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి,పట్నం నరేందర్‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, యువనాయకులు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, పలువురు పార్టీ నాయకులతో కలిసి వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పట్నం మహేందర్‌రెడ్డికి గజమాలతో ఘనంగా సన్మానించారు. మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నామినేషన్‌ వేసిన అనంతరం మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..సీఏం కేసీఆర్‌కు ఎమ్మెల్సీగా ప్రకటిచడంతో కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తున్నామన్నారు.

ఎంపీటీసీ, కార్పొరేట్‌,కౌన్సిలర్లు 80 నుంచి 90 శాతం మెజార్టీ మాకే ఉందన్నారు. కాం గ్రెస్‌,బీజేపీ పోటీలో కూడా లేదన్నారు. ప్రజలకు,ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఇప్పటికే ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో ఏకగ్రీవం అయినట్లు గుర్తించారు. జిల్లాలో అక్కడక్కడ చిన్న, చిన్న సమస్యలు ఉంటాయి,వాటిని పరిష్కరిచేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. సీసీ రోడ్లు, అభివృద్ధి పనులు చేస్తామన్నారు. కాంగ్రెస్‌,బీజేపీ పార్టీలు పోటీనిచ్చే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో ఉన్న జడ్పీటీసీ,ఎంపీపీ,ఎంపీటీసీ, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు కలిసి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిచిన్నట్లు గుర్తు చేశారు. నా స్థానం భర్తీ చేసేందుకు కృషిచేయాలని కోరారు. వారి వెంట నేతలు రామేశ్వర్‌రెడ్డి ,వెంకట్‌రెడ్డి తదితరులున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ తరపున 4 నామినేషన్లు దాఖలు ..
కాంగ్రెస్‌ పార్టీ తరఫున 4 నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున కే.ఉదయ్‌మోహన్‌రెడ్డి, కే.ప్రతాప్‌రెడ్డి, చల్లా నర్సింహారెడ్డి నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. వారి వెంట చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహ్మారెడ్డి తదితరులు పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...