2నెలల్లో 60వేల మరుగుదొడ్లను నిర్మిస్తాం


Tue,May 14, 2019 03:57 AM

-ప్రజలకు అవగాహన కల్పించాలి
-సమన్వయంతో లక్ష్యాన్ని పూర్తి చేయాలి
-నిర్మాణాలను నోడల్ అధికారులు పర్యవేక్షించాలి
-అంగన్‌వాడీ సెంటర్లలో మూత్రశాలలు నిర్మించాలి
వికారాబాద్, నమస్తే తెలంగాణ : స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 60వేల మరుగుదొడ్ల నిర్మాణ పనులను 2 నెలల్లో పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా తెలిపారు. సోమవారం హైదరాబాద్ సచివాలయం నుంచి చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లతో స్వచ్ఛభారత్ మరుగుదొడ్ల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహణ, డంపింగ్‌యార్డ్‌లపై సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా జిల్లా కలెక్టర్ ఇట్టి పనులు పూర్తి చేయుటకు నోడల్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. మండలాల వారీగా పనులను కేటాయించి వేగవంతం చేస్తూ పర్యవేక్షించడం జరుగుతుందని కలెక్టర్ ప్రభుత్వ కార్యదర్శికి తెలిపారు. నిర్మాణ పనులకు 2 విడుతలు రూ.6వేల చొప్పున మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. నిర్మాణాలకు అవసరమైన నిధులు లబ్ధిదారులకు రుణాలు కూడా ఇప్పించి పనులు చురుకుగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గుంతలు తవ్వించి మరుగుదొడ్లకు మార్కింగ్‌లు చేయడం జరుగుతుందని,రాబోయే రెండు నెలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని ప్రభుత్వ కార్యదర్శికి తెలియపర్చారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 10 మంది పిల్లల కంటే తక్కువగా ఉంటే దగ్గరలోని పాఠశాలలో చేర్పించాలని, అంగన్‌వాడీ కేంద్రాల దగ్గర ప్రభుత్వ పాఠశాలలోకి మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్‌కే జోషి తెలిపారు. అంగన్‌వాడీ సెంటర్లలో మూత్రశాలలు తప్పకుండా నిర్మించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎక్కువ మంది పిల్లలను చేర్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో కలెక్టర్ సంబంధిత మున్సిపల్ కమిషనర్లతో డంపింగ్ యార్డులతో స్థలాలు సేకరించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో జాన్సన్, డీడబ్ల్యూవో జోత్స్న, డీఈవో రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...