టీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి


Mon,May 13, 2019 02:32 AM

బంట్వారం: గ్రామాలు అభివృద్ధ్ది కావాలంటే స్థాని క సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని జడ్పీచైర్‌పర్సన్ పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆమె బంట్వారం మండలంలోని బస్వాపూర్, కోట్‌పల్లి మండలం బార్వాద్ తదితర గ్రామాల్లో ఇంటింటికీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటుతో కొత్త జిల్లా లు, మండలాలు ఏర్పాటు చేసి, అభివృద్ధి చేసిన ఘన త టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకుందని అన్నారు. గతం లో బంట్వారం జడ్పీటీసీగా ఉండి చైర్మన్‌గా ఉండ గా బంట్వారం మండలానికి అధికంగా నిధులను ఇచ్చి అభివృద్ధి చేశామన్నారు. ప్రతి గ్రామంలో నాడు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంగన్‌వాడీ భవనాలు, పాఠశాల భవనాలు నిర్మించామన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా తాను చేసి న అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని అన్నారు. ఇప్పటికీ ఈ మండలంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు నా వం తుగా కృషి చేస్తానని అన్నారు. బం ట్వారం, కోట్‌పల్లి మండలాలు జిల్లాలోనే చాలా వెనుకబడి ఉన్నాయని, మరోసారి అవకాశం ఇస్తే ఈ మండలాలను ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఎంపీటీసీ అభ్యర్థులు శాంతయ్య, పి.మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌ల సం ఘం అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచ్ వెంకటేష్, నాయకులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...