తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం


Mon,May 13, 2019 02:32 AM

మర్పల్లి/వికారాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం దేశానికి, ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచే పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధిలో దూసుకుపోతుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం లో భాగంగా వికారాబాద్ మండలంలోని మైలార్‌దేవరంపల్లిలో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ర్యాలీలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా మర్పల్లి మండల పరిధిలోని పట్లుర్ గ్రామంలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో18 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకొని జడ్పీ పీఠంపై టీఆర్‌ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ నాయకులు చెప్పే కాకమ్మ కథలు, అబద్దపు మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధి నిరుపేదల సంక్షేమానికి అనే పథకాలతో రాష్ర్టాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, 24గంటల నిరంతర ఉచిత విద్యుత్ తదితర పథకాలను ప్రవేశపెట్టి అముల చేశారని అన్నారు. తల్లిబిడ్డకు రక్షణగా కేసీఆర్ కిట్‌ను అందజేసిందన్నారు. పాప పుడితే రూ.13 వేలు, బాబు పుడితే రూ.12వేలు అందించి 102 వాహనంలో ఇంటివద్దకు తీసుకెళ్లేందుకు సౌకర్యం కల్పించిందన్నారు. ప్రస్తుతం ఉన్న పింఛన్‌లను వచ్చే మాసం నుంచి రెట్టింపు చేయబోతున్నామన్నారు. నిరుద్యోగుల కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నిరుద్యోగ భృతి పథకం కింద నిరుద్యోగులకు రూ.3016లు త్వరలోనే ఇవ్వబోతున్నారన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని వారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి సువర్ణదేవి, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, నాయకులు రాంచంద్రారెడ్డి, గోపాల్, గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...