అడవుల రక్షణకు కందకాల ఏర్పాటు


Mon,May 13, 2019 02:32 AM

పరిగి రూరల్: అడవుల సంరక్షణతో పాటుగా రక్షణ కోసం ప్రభుత్వం అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రక్షణ కందకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గతంలో మాదిరిగా గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం కోసం కలప, వంట చెరుకు కోసం ఎడ్ల బండ్లను, ట్రాక్టర్లను అడవిలోకి తీసుకెళ్లడం ఇప్పుడు కష్టంగా ఉంది. అడవిలో రక్షణ కందకాల ఏర్పాటుతో కలప అక్రమ రవాణాదారులకు చెక్ పెట్టినట్టయ్యింది. ప్రస్తుతం అక్రమార్కులకు ఇబ్బందిగా ఈ కందకాలు మారా యి. పరిగి మండలంలోని ఇంబ్రహీంపూర్, మిట్టకోడూర్ గ్రామాల్లో 1200 హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. 15 నెలల క్రితం అటవీశాఖ శాఖ వారు 6 కిలో మీటర్ల వరకు ఇంబ్రహీంపూర్ ఫేజ్-1 అడవి చుట్టూ లోతుగా కందకాలు తవ్వించారు. మరో ఆరు కిలో మీటర్లు కందకాలు తవ్విస్తే అడవికి పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పడనుంది. కందకాల నుంచి అడవిలోకి ప్రవేశించటం ఇతరులకు చాలా కష్టంగా మారుతుంది. ప్రస్తుతం జనాలు వంట చెరుకు కోసం అడవిలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. అడవిలోకి వెళ్లేందుకు కందకాలు అడ్డు ఉండటంతో చాలా మంది గ్యాస్ సిలిండర్ల వాడకం తప్పనిసరైంది. కందకాల పుణ్యయమన్ని ప్రజలు గ్యాస్ వినియోగంపై మక్కువ చూపుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలు ఐకేపీ తదితర పథకాల్లో సబ్సిడీ గ్యాస్‌లు పొందుతున్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...