గ్రామాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయం


Mon,May 13, 2019 02:31 AM

పూడూరు: సొంత గడ్డ రుణం తీర్చుకునేందుకు తల్లిదండ్రుల పేరున ట్రస్టు ఏర్పాటు చేసి బేరి రాంద్రయ్య యాదవ్ సామాజిక సేవ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని నియోజకవర్గం యువజన సంఘాల నాయకుడు కడ్మూరు ఆనందం పేర్కొన్నారు. ఆదివారం పూడూరు మండలం మిట్టకంకల్ గ్రామంలో బేరి వెంకటయ్య వెంకటమ్మ యాదవ్ మెమోరియల్ ట్రస్ట్ కన్వీనర్ బేరి రాంచంద్రయ్య యాదవ్ ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు,యువకులకు లైబ్రరీ, హరితహారం ద్వారా మొక్కల పంపిణీ వంటి కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని మౌనిక ఇంటర్ సెకండియర్‌లో 940 మార్కులు సాధించడంతో ఆమెకు ప్రోత్సాహకంగా రూ.10వేలు ఇవ్వగా, ట్రస్టు ద్వారా బేరి రాంచంద్రయ్య రూ.5వేలు, సర్పంచ్ శ్యామ్ రూ.2500లు,యువకుడు అనిల్ రూ.200వేలు ఆర్థిక సహాయం అందజేయగా కె.కృష్ణయ్యగౌడ్ లైబ్రరి కోసం రూ.5వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎ.ఆనందం, బి.రాంచంద్రయ్యలు మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో అందరు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. అనంతరం ట్రస్టు కన్వీనర్, ఉప సర్పంచ్ బేరి రాంచంద్రయ జన్మదినం సందర్భంగా పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్యామ్, రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి రాములు,బేరి ఆంజేయులు, కానిస్టేబుల్ యాదయ్య, మహేందర్, దేవయ్య, బందయ్య తదితరులు ఉన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...