బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యం


Mon,May 13, 2019 02:31 AM

నవాబుపేట: అభివృద్ధిని కోరేవారందరు ఈనెల 14 జరగనున్న స్థానిక ఎన్ని కల్లో అధికార పార్టీ గుర్తు కారు గుర్తుకు ఓట్లు వేసి అభ్యర్థులందరినీ గెలిపిం చాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మండల ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండల కేంద్రంతో పాటు, మీనపల్లికలాన్, చిట్టిగిద్ద తదితర గ్రామాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆయా గ్రామాల్లో ప్రజలకు ఘన స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా ఆయా గ్రామాల్లో రోడ్ షోలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల స్వరా ష్ట్ర కలను సాకారం చేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలన్న అధినేత కేసీఆర్ సంకల్పాన్ని బలపరిచేందుకు స్థానిక ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. అనేక పథకాలను అమలు చేస్తూ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ అన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలను పక్కన పెట్టి రాష్ర్టాభివృద్ధికి శ్రీకారం చుట్టాలని ఆయన కోరారు. ఇతర పార్టీలకు ఓట్లు వేయడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని ఓటు వృథా అవుతుందని అన్నారు. అన్ని విధాలుగా రాష్ర్టాన్ని ప్రగత పథంలో నడిపిస్తున్న అధికార పార్టీని బలపరిచి టీఆర్‌ఎస్ అభ్యర్థులను దీవించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ పాండురంగారెడ్డి, జడ్పీటీసీ రాంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సినీనటి ఉమాదేవి, సీనియర్ నాయకులు మల్‌రెడ్డి, శివరాజు, కల్యాణ్‌రావు, రాములు, జడ్పీటీసీ అభ్యర్థి కాలె జయమ్మ, సర్పంచ్‌లు విజయలక్ష్మి, శ్రీలత, మానిక్‌రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...