లక్ష్యాలను పూర్తి చేయాలి


Wed,April 24, 2019 12:00 AM

-మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయాలి
-పంచాయతీ అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్ల అవగాహన కార్యక్రమంలో డీఆర్‌డీవో జాన్సన్
వికారాబాద్, నమస్తే తెలంగాణ : స్వచ్ఛ్ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం కార్యక్రమ ంలో భాగంగా 1 జీపీ, వన్ నర్సరీ అనే విధంగా జిల్లా లో కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయాలని డీఆర్‌డీవో జాన్సన్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ అంబేద్కర్ భవన్‌లో జిల్లా పంచాయతీ అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణం పనులు 64 వేల నిర్మాణ దశ లో జిల్లాలో కొనసాగుతున్నాయని తెలిపారు. వీటన్నిటిని ఈ నెలాఖరు వరకు 100 శాతం పనులు పూర్తి చేసి వినియోగింలోకి తీసుకురావాలని సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయూటకు గ్రామ పంచాయతీ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కమిటీలో సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఆశ వర్కర్లు, వీవో లీడర్లు, వీవోఏలు, ఎఫ్‌ఏలతో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ప్రజలు మరుగుదొడ్లు నిర్మించుకునేలా అవగాహన చేసి వాటిని వినియోగంలోకి తీసుకు వచ్చేలా చూడాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం కొరకు లబ్ధిదారులకు ప్రభుత్వం అం దజేస్తున్న రూ.12వేల నగదుతో పూర్తి చేసుకోవాలన్నారు. నిర్మాణ పనుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో వేగవంతంగా పనులను పూర్తి చేయాలన్నారు. హరితహారంలో భాగంగా 1జీపీ వన్ నర్సరీ కింద నర్సరీలో మొక్కల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. నర్సరీలో పెంచిన మొక్కలను అవసరం మేరకు రైతులందరికీ జూన్ 15 నుంచి నాటేందుకు సిద్ధంగా ఉంచాలని ఆయన తెలిపారు. గ్రామీణ స్థాయి అధికారులు, కింది స్థాయి సిబ్బంది ప్రతి ఒక్కరూ చక్కగా పని చేసి సమర్ధవంతంగా విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీపీవో రిజ్వానా, అడిషనల్ పీడీ గుప్తా, ఏపీడీ రాజేంద్రప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...