ఎన్నికలు సజావుగా నిర్వహించాలి


Tue,April 23, 2019 11:57 PM

- ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే చట్టం ప్రకారం చర్యలు
-ప్రచారానికి ప్రార్థన స్థలాలను వేదికలుగా వాడుకోకూడదు
-జాతి, కులం, మతం పేర్లతో ఓట్లు వేయాలని అభ్యర్థులు ప్రచారం చేయొద్దు
-డీఆర్‌వో మోతీలాల్
-ఎంసీసీ, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, ఏఈవో టీంలకు శిక్షణ తరగతులు
వికారాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లాలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణ అధికారుల శిక్షణ తరగతులను సరైన విధంగా అవగాహన కల్పించుకోని ఎన్నికలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి మోతీలాల్ తెలిపారు. మంగళవారం వికారాబాద్‌లోని కలెక్టరేట్‌లో స మావేశ మందిరంలో ఎంసీసీ, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, ఏఈ వో టీంలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భం గా డీఆర్‌వో మాట్లాడుతూ జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల కోడ్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారానికి ప్రార్థన స్థలాలను వేదికలుగా వాడుకోకూడదని సూచించారు. జాతి, కులం, మతం పేర్లతో ఓట్లు వేయాలని అభ్యర్థులు ప్రచారాలు చేయొద్దని తెలియజేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వ్యక్తిగత నివాసాల వద్ద, వారి కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు, పికెటింగ్‌లు ప్రచారాలు నిర్వహించకూడదన్నా రు. అనంతరం జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, డీఆర్‌డీ వో జాన్సన్ మాట్లాడుతూ సం బంధిత అధికారుల అనుమతు లు పొందకుండా మైకులు, బ హిరంగ సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదని పే ర్కొన్నారు.

ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతి పొందిన బహిరంగ సమావేశాలకు, రోడ్‌షోల వద్ద మాత్రమే లౌడ్ స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్యలో మాత్రమే ఉపయోగించాలన్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల నియమావళి నిబంధనలను అతిక్రమించకుండా కార్యక్రమాలను కొనసాగిస్తూ జాగ్రత్తలు వహించాలన్నారు. ఎన్నికల సహాయ వ్యయ పరిశీలకుడు హరికిషన్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన ప్రచారం మాత్రమే అభ్యర్థులు ఖర్చులు చేయాలని తెలియజేశారు. నిర్ణయించిన దాని కంటే మించి అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు చేయరాదని హెచ్చరించారు. పోటీ చేసే అభ్యర్థులు రోజు వారి ఖర్చులను పొందుపర్చాలన్నారు. వివరాలను ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోపు సంబంధిత మండలాల ఎంపీడీవోలకు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహ ణ తీరుపై ఏమైనా ఫిర్యాదులు, సమస్యలు ఉంటే ఎన్నికల పరిశీలకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే పార్టీల అభ్యర్థులపై వివిధ చట్టాల కింద చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్నికల సెల్ సమన్వయ కర్త సత్తయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...