రెండో రోజు 48 నామినేషన్లు దాఖలు


Tue,April 23, 2019 11:56 PM

-జడ్పీటీసీకి 7,ఎంపీటీసీ స్థానాలకు 41 నామినేషన్లు
-నేడు నామినేషన్లకు చివరి రోజు
పరిగి, నమస్తే తెలంగాణ: వికారాబాద్ జిల్లా పరిధిలో తొలి విడుత పరిషత్ ఎన్నికలకు సంబంధించి రెండో రోజు మంగళవారం మొత్తం 48 నామినేషన్లు దాఖలు చేయబడ్డాయి. ఇందులో జడ్పీటీసీ స్థానాలకు 7 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 41 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. రెండో రోజు దాఖలైన నామినేషన్లను ఆయా మండలాల వారీగా రెండో రోజు మంగళవారం పరిగి మండలంలోఎంపీటీసీ స్థానాలకు 3నామినేషన్‌లు, దోమలో జడ్పీటీసీకి ఒకటి, ఎంపీటీసీలకు 3,కులకచర్లలో ఎంపీటీసీలకు 5,పూడూరులో జడ్పీటీసీకి 4 నామినేషన్లు, ఎంపీటీసీలకు 10,కొడంగల్‌లో ఎంపీటీసీలకు 5,బొంరాస్‌పేట్‌లో ఎంపీటీసీలకు 6,దౌల్తాబాద్ మండలంలో జడ్పీటీసీకి 2,ఎంపీటీసీలకు 9 నామినేషన్లు దాఖలు చేయబడ్డాయి.

జడ్పీటీసీలకు 8...ఎంపీటీసీలకు 65 నామినేషన్లు
జిల్లా పరిధిలో తొలి విడుత పరిషత్ ఎన్నికలు జరిగే 7 మండలాల్లో నామినేషన్ల దాఖలుకు సంబంధించి రెండు రోజులలో మొత్తం జడ్పీటీసీ స్థానాలకు 8 నామినేషన్లు, ఎంపీటీసీల స్థానాలకు 65 నామినేషన్లు దాఖలు చేయబడ్డాయి. సోమవారం, మంగళవారం రెండు రోజుల్లో ఈ మేరకు నామినేషన్‌లు దాఖలు చేశారు. నామినేషన్ల తొలిరోజు సోమవారం జడ్పీటీసీకి ఒకటి, ఎంపీటీసీలకు 24 నామినేషన్లు దాఖలు చేయబడగా, మంగళవారం జడ్పీటీసీ స్థానాలకు 7, ఎంపీటీసీ స్థానాలకు 41 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో జడ్పీటీసీ స్థానాలకు దాఖలైన 8 నామినేషన్‌లలో టీఆర్‌ఎస్ 3, బీజేపీ ఒకటి, కాంగ్రెస్ పార్టీ 2, బీఎస్పీ ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒకటి మొత్తం 8 నామినేషన్‌లు దాఖలు చేశారు. ఎంపీటీసీలకు దాఖలైన మొత్తం 65 నామినేషన్‌లలో టీఆర్‌ఎస్ పార్టీ తరపున 23, బీజేపీ 12, కాంగ్రెస్ పార్టీ 22, స్వతంత్ర అభ్యర్థులు 8 నామినేషన్‌లు దాఖలు చేశారు.

నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు
జిల్లాలో పరిషత్ ఎన్నికలు జరిగే 7 మండలాల్లో తొలి రెండు రోజులు తక్కువ సంఖ్య లో నామినేషన్‌లు దాఖలైనప్పటికీ చివరి రోజు పెద్ద ఎత్తున నామినేషన్‌లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. తొలి విడుతలో 7 జడ్పీటీసీ, 97 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా పార్టీల తరపున అభ్యర్థుల ఖరారు కాకపోవడంతో సోమవారం చాలా తక్కువ సంఖ్యలో నామినేషన్‌లు దాఖలయ్యాయి. రెండో రోజు సైతం పలు మండలాల్లో అభ్యర్థుల ఖరారు కొలిక్కి రాకపోవడం, కొన్నిచోట్ల అభ్యర్థులు ఖరారైనా మంగళవారం రోజు నామినేషన్ వేసేందుకు కొందరు వెనుకడుగు వేశారు. ఇదిలావుండగా బుధవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్‌లు దాఖలయ్యే అవకాశం ఉన్నది. మంగళవారం రాత్రి వరకు పార్టీ టికెట్లు ఖరారు పూర్తి చేసేందుకు కసరత్తు చేశారు. సాధ్యమైనంత వరకు పూర్తిస్థాయిలో టికెట్‌లు ఖరారు చేయనున్నారు. ఎక్కడైనా పోటీ మరింత తీవ్రంగా ఉన్నచోట నామినేషన్లు వేయించి పార్టీ అభ్యర్థుల ఖరారు తర్వాత బీ ఫారమ్ అందజేయనున్నట్లు తెలిసింది. చివరి రోజు బుధవారం ఉదయం నుంచే నామినేషన్లు దాఖలుకు పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలిరానుండడంతో పోలీసులు సైతం నామినేషన్‌లు స్వీకరించే కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...