స్వచ్ఛతకు రూపకల్పన


Tue,April 23, 2019 11:56 PM

-సాఫ్ హైదరాబాద్.. షాన్‌దార్ హైదరాబాద్..
-చందానగర్ సర్కిల్‌లో సరికొత్త స్వచ్ఛ కార్యక్రమానికి రంగం సిద్ధం
-నాలుగు డివిజన్లలో6 ప్రాంతాలు, 10 వేల ఇండ్లు ఎంపిక
-ప్రజలు, స్వచ్ఛంద, సంక్షేమ సంఘాలు, మత పెద్దల సహకారం
-18 స్వచ్ఛ అంశాలపై అన్ని వర్గాల వారికి అవగాహన కల్పిస్తున్న సిబ్బంది
చందానగర్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ): జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సాఫ్ హైదరాబాద్.. షాన్‌దార్ హైదరాబాద్.. కార్యక్రమం చందానగర్ సర్కిల్ 21 పరిధిలో కార్యరూపం దాలుస్తున్నది. మే 1వ తేదీ నుంచి నగరంలోని 150 వార్డుల్లో 2500 ఇండ్ల విస్తీర్ణాన్ని ఒక కేంద్రం(లొకేషన్)గా తీసుకుని 100 రోజుల్లో పూర్తి స్థాయి స్వచ్ఛ కార్యక్రమాలను అమలయ్యేలా బల్దియా చీఫ్ కమిషనర్ దానకిశోర్ ఒక ప్రణాళికను ప్రతిపాదించారు.
ఆరు ప్రాంతాలు ఎంపిక..
చందానగర్ సర్కిల్ పరిధిలోని 4 డివిజన్లకు గాను ఒక్కో డివిజన్‌కు 2500 చొప్పున మొత్తం 10వేల ఇండ్లను కేంద్రంగా చేసుకుని ప్రాథమికంగా స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టనున్నారు. శాంతినగర్, ఎంఏనగర్, స్టాలిన్ నగర్, సుభాష్‌చంద్రబోస్ నగర్, సైబర్‌వ్యాలీ, న్యూ సైబర్ వ్యాలీలు కలిపి మొత్తం ఆరు ప్రాంతాలను ప్రధానంగా ఎంపిక చేశారు. ప్రతి డివిజన్‌కు ఒక స్వచ్ఛ సీఆర్‌పీని ఎంపిక చేశారు. ఆ సీఆర్‌పీ ప్రజలు, స్వచ్ఛంద, సంక్షేమ సంఘాలు, విద్యార్థులు, స్వయం సహాయక బృందాలు, సీనియర్ సిటిజన్లు, మత పెద్దలను కలుపుకొని ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో స్వచ్ఛత కోసం కృషిచేయనున్నారు. అందుకు సంబంధించి ఎంపిక చేసిన 18 స్వచ్ఛత అంశాలపై అన్ని వర్గాల వారికి అవగాహన కల్పిస్తారు. అందుకోసం ఆ సీఆర్‌పీకి రూ.6వేల గౌరవ వేతనం సైతం ఇవ్వనున్నారు.

స్వచ్ఛత లక్ష్యసాధన సమయం ఇలా...
ఇంటింటి నుంచి చెత్తను స్వచ్ఛ ఆటోద్వారా సేకరించే 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం, రోడ్లు, మురుగు, వరద కాలువలు, చెరువుల్లో గార్బేజీని వేయకుండా నిరోధించడం, చెత్తను తగుల బెట్టకుండా చూడటం, విరిగిన చెట్లు, కొమ్మల తొలిగింపు లక్షాన్ని 30 రోజుల్లో చేరుకోవాలి.
గార్బేజీ, వర్నరబుల్ పాయింట్ల తొలిగింపు, భవన నిర్మాణ వ్యర్ధాల తొలగింపు, ఖాలీ స్థలాల్లో చెత్త వేయకుండా చర్యలకు, బహిరంగ మలమూత్ర విసర్జన పాయింట్లు ఎత్తేయడం, పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్లను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా ఉండేలా చూసేందుకు, కూలపోయిన ఫుట్ పాత్‌లు, డివైడర్ల మరమ్మతులకు 45 రోజుల లక్ష్యం
డ్రైనేజీ ఓవర్ ఫ్లో పాయింట్లను గుర్తించి వాటిని నివారించడం, వరదనీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి వాటికి మరమ్మతులు చేయడం, ఇంటింటికీ సేకరించే చెత్తను తడి, పొడి వేర్వేరుగా సేకరించేలా 90 రోజుల్లో పకడ్భందీగా అమలయ్యేలా చూడాలి. స్థానికంగా కంపోస్టు యూనిట్ల ఏర్పాటుకు 60 రోజులు లక్ష్యం.

ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తాం
మర్పల్లి : గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకోని లబ్ధిదారుల కు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షే మ పథకాలు నిలిపి వేయడం జ రుగుతుందని మండల అభివృద్ధి అధికారి నాగలక్ష్మి అన్నారు. మ ంగళవారం మండల పరిధిలోని పట్లూర్ అనుబంధ గ్రామమైన తండాలో మరుగుదొడ్ల నిర్మాణం పై ప్రజలకు అవగాహన కల్పించి అనంతరం మరుగుదొడ్ల నిర్మాణానికి ముగ్గులు వేశారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించి అదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. ప్రతి గ్రామంలో అధికారులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇంటి ంటికీ తిరుగుతూ మరుగుదొడ్లు నిర్మించుకునేందు కు ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వ చ్చి మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు అంజయ్యగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు సురేశ్‌కుమార్, గ్రామ కార్యదర్శి సంతోశ్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మరుగుదొడ్డి ఆత్మగౌరవానికి చిహ్నం
బంట్వారం : ప్రతి ఇంటికి మరుగుదొ డ్డి నిర్మాణం అంటే ప్రజల ఆత్మ గౌరవానికి చిహ్నమని సర్పంచ్ వెంకటమ్మ అ న్నారు. మండల పరిధిలోని సల్బత్తాపూర్ గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి ము గ్గులు వేశారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఎం తో అవసరమని చెప్పారు. గ్రామంలోని మహిళా సంఘాలు, దివ్యాంగుల సంఘా లు మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజలకు అ వగాహన కల్పించారు. కార్యక్రమంలో ది వ్యాంగుల సంక్షేమ జిల్లా అధ్యక్షుడు న ర్సింహులు, ఎఫ్‌ఏ రవి, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...