నామినేషన్లు షురూ..


Tue,April 23, 2019 12:06 AM

- తొలి రోజు ఎంపీటీసీకి 24, జడ్పీటీసీ స్థానానికి ఒక నామినేషన్ దాఖలు

పరిగి, నమస్తే తెలంగాణ:జిల్లాలో తొలి విడుతలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎ న్నికలకు సంబంధించి తొలిరోజు తక్కు వ సంఖ్యలో నామినేషన్‌లు దాఖలయ్యా యి. తొలి విడుతలో జిల్లాలోని 7 మండలాల్లో 7 జడ్పీటీసీ, 97 ఎంపీటీసీ స్థానాలకు మే 6వ తేదీన పోలింగ్ జరుగుతుం ది. ఇందుకు సంబంధించి సోమవారం నుంచి నామినేషన్‌ల స్వీకరణ కార్యక్ర మం ప్రారంభమైంది. సోమవారం ఎంపీటీసీ స్థానాలకు 23 మంది అభ్యర్థులు 24నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్‌లను ఆయా మండలాల వారీగా పరిశీలిస్తే పరి గి మండలంలో ఒక నామినేషన్, కొడంగల్‌లో ఒక నామినేషన్, బొంరాస్‌పేట్‌లో 7,దౌల్తాబాద్‌లో 2,కులకచర్లలో5, దోమ లో2, పూడూరులో 6 నామినేషన్లు దా ఖలు చేయబడ్డాయి. ఆయా క్లస్టర్‌లలో తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.

జడ్పీటీసీకి ఒకే ఒక్కటి...
తొలి విడుతలో 7 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా సోమవారం కేవలం ఒకే ఒక్క నామినేషన్ దాఖలు చేయబడింది.బొంరాస్‌పేట్ మండలంలో జడ్పీటీసీ స్థానానికి ఒక నామినేషన్ దాఖలైంది. మిగతా ఆరు మండలాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు.

బుధవారం చివరి రోజు
నామినేషన్ల చివరి రోజు బుధవారం పెద్ద ఎత్తున నామినేషన్‌లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలి విడుతలో ఎన్నికలు జరిగే మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక సోమవారం సా యంత్రానికి ఒక కొలిక్కి వచ్చింది. మంగళవారం నామినేషన్ దాఖలుకు పెద్దగా ఆసక్తి చూపరు. దీంతో అన్ని పార్టీల వారు నామినేషన్‌ల చివరి రోజు బుధవారం పెద్ద ఎత్తున నామినేషన్‌లు దాఖలు చేసే అవకాశం ఉంది.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...