చెక్‌డ్యాంల నిర్మాణానికి సర్వే


Tue,April 23, 2019 12:05 AM

తాండూరు, నమస్తే తెలంగాణ: కాగ్నా, కాక్రవేణి వాగులపై ప్రభుత్వం చెక్‌డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో ఈ ప్రాంత రైతుల దశాబ్దాల కల నెరవేరనుంది. కాగ్నా, కాక్రవేణి వాగులపై చెక్ డ్యాంల నిర్మాణాలకు సత్వరం నిధుల మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండడంతో నియోజకవక్గంలోని కాగ్నా పరివాహక ప్రాంత రైతులకు పెద్ద ఎత్తున లాభాలు చేకూరనున్నాయి. జిల్లాలో వృథాగా పోతున్న కాగ్నా, కక్రవేణి వాగుల జలాలను సద్వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా నీటిపారుదల శాఖ, జిల్లా గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ అధికారులు సర్వే పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తాం డూరు నియోజకవర్గంలోని తాండూరు మండలం ఎలిమకన్య చిట్టిఘణాపూర్, బషీరాబాద్ మండలం జీవన్గీ, యాలాల మండలం కోకట్ గ్రామాల పరిధిలోని కాగ్నా వాగు పరివాహక ప్రదేశాల్లో సోమవారం అధికారులు సర్వే లు నిర్వహించారు. తాండూరు నియోజకవర్గానికి మొత్తం ఎనిమిది చెక్ డ్యాంల నిర్మాణాలకు ప్రభుత్వం నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. తాండూ రు మండలం ఎలిమకన్య, చిట్టిఘణాపూర్, బిజ్వార్, పెద్దేముల్ మండలం మన్‌సాన్‌పల్లి, యాలాల మండలం గోవిందరావు పేట్, కోకట్, బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామాల వద్ద చెక్‌డ్యాంల నిర్మాణాలకు ప్రభు త్వం అనుమతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఒక్కో చెక్ డ్యాంకు రూ. 6 నుంచి 12 కోట్ల వరకు నిధులు వెచ్చించనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఒక్కో చెక్ డ్యాం 200 మీటర్ల నుంచి 300 మీటర్ల వరకు వెడల్పుతో నిర్మాణమవుతుందని వెల్లడించారు. జిల్లాలోని తాండూరు నియోజకవర్గానికి 8, పరిగి నియోజకవర్గానికి 5, వికారాబాద్ నియోజకవర్గానికి 5, కొడంగల్ నియోజకవర్గానికి 2 చెక్‌డ్యాంలకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధ్దం చేస్తున్నారు. చెక్‌డ్యాంల నిర్మాణాలకు ప్రతిపాదించిన స్థలాల్లో భూగర్భ జలాల ఆవశ్యకత, పరివాహక ప్రదేశం ఎంత విస్తీర్ణం మేర ఉంది, ఇప్పటి వరకు ఆయా ప్రదేశాల్లో ఎంత సాగు భూమి ఉంది. రైతులు ఎన్ని బోర్లు వేసుకున్నారు. కాగ్నా వాగులో చెక్‌డ్యాం నిర్మాణమైతే నీటి లభ్యత ఎలా ఉంటుందన్న విషయాలపై అధికారులు సర్వే చేశారు. సోమవారం నీటిపారుదల శాఖ జేఈలు నిఖేష్‌కుమార్, ధర్మకుమార్, నవీన్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ జియోలజిస్ట్ శ్రీవల్లి తదితరులున్నారు.

రైతులకు పలు రకాలుగా ప్రయోజనం
చెక్ డ్యాంల నిర్మాణంతో కాగ్నా వాగు జలాలు సద్వినియోగించుకునడంతో పాటు రైతులకు పలు రకాలుగా ప్రయోజనం కలగనుంది. ఒక్కో చెక్‌డ్యాం ద్వారా 0.35 టీఎంసీల నుంచి 0. 4 వరకు టీఎంసీల నీరు నిలిచే అవకాశాలుండడంతో జిల్లాలో నిర్మించే 20చెక్ డ్యాంల వల్ల కనీసం 7 నుంచి 8 టీఎంసీల నీరు సద్వినియోగించుకునేందుకు ఆస్కారముంటుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. అలాగే ఒక్కో చెక్‌డ్యాం పరిధిలో 1500 మీటర్ల నుంచి 3000 మీటర్ల పరిధిలో కాగ్నా వాగులో నీరు నిలిచే అవకాశాలుంటాయి. దీంతో 200 నుంచి 300కు పైగా సమీప బోర్లలో భూగర్భ జలాలు పెరుగుతాయి. చెక్ డ్యాంల నిర్మాణంతో సమీప గ్రామాల్లో నీటి కరువుకు పూర్తిగా చెక్ పడనుంది.

నెరవేరనున్న రైతుల కళ...!
కాగ్నా జలాలను సద్వినియోగ పరచాలని గతంలో దశాబ్దాలుగా తాండూరు ప్రాంత రైతులు కోరినా గత పాలకులు గతంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దీంతోఎన్నో అవకాశాలున్నా నీటి వనరులు కర్ణాటక వైపు వృథాగానే పారేవి. తాండూరు నియోజకవర్గంలో ప్రవహిస్తున్న కాగ్నా పరివాహక ప్రాంతంలో కనీసం 40 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సుమారు 40 కిలోమీటర్ల పొడవున కాగ్నా వాగు ప్రవహిస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధనలో భాగంగా చెక్‌డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో క్రమంగా రైతుల్లో ఆశలు మెండవుతున్నాయి.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...