కాంగ్రెస్ ఖతం


Tue,April 23, 2019 12:05 AM

బషీరాబాద్/యాలాల: కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయిందని, మరో ఇరువై సంవత్సరాలు అధికారంలో ఉండేది టీఆర్‌ఎస్ పార్టీనే కాబట్టి అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలిపించుకోవాలని మాజీ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. సోమవారం బషీరాబాద్, యలాల మండల కేంద్రాల్లో ఎంపీపీలు కరుణ అజయ్‌ప్రసాద్,ఎంపీపీ సాయన్న గౌడ్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే బీ ఫారాలు ఇస్తామన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. తాండూరు నియోజకవర్గంలోని యాలాల,బషీరాబాద్, తాం డూర్, పెద్దేముల్, కోట్‌పల్లి మండలాల పరిధిలోని అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. యాలాల మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుని ఎంపీపీ పీఠా న్ని కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశం అనంతరం యాలాల టీఆర్‌ఎస్ ఎంపీపీ అభ్యర్థిగా పురుషోత్తంరావును ప్రకటించారు.

మేనెల నుంచి అన్ని రకాల పింఛన్లను రెట్టింపుగా ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 16 ఎంపీలను గెలువబోతున్నామని, అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఎంపీటీసీలను, జడ్పీటీసీలను గెలుచుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల తరువాత గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయడం లేదని మరోసారి గుర్తు చేశారు. తండాలను పంచాయతీలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మే నెల నుంచి రైతులకు రైతుబంధు కింద ఎకరాకు రూ. 5వేలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ లకా్ష్మరెడ్డి,టీఆర్‌ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి పురుషోత్తంరావు, యాలాల మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ సురేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ యాలాల మండల అధ్యక్షుడు శ్రీనివాస్, యలాల మండల కార్యదర్శి రాములు,సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు భీమప్ప, ఎంపీటీసీ సంఘం మండల అధ్యక్షుడు శంకర్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, టీఆర్‌ఎస్ బషీరాబాద్ మండల అధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి, బషీరాబాద్ నాయకులు శంకర్‌రెడ్డి, అజయ్‌ప్రసాద్, సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ ప్రియాంక పలు గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,పలు గ్రామాల కార్యకర్తలు,బూత్ కమిటీ సభ్యలు పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...