నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేద్దాం


Tue,April 23, 2019 12:04 AM

తాండూరు, నమస్తే తెలంగాణ: సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా మార్చేందుకు గ్రామాల్లో నూతనంగా నియమితులైన గ్రామ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్ల సహకారంతో మరుగుదొడ్ల లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా డ్వామా పీడీ జాన్సన్ సూచించారు. తాండూరు పట్టణంలోని భూకైలాస్ ఫంక్షన్ హాలులో సోమవారం గ్రామ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు సంపూర్ణ పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో వచ్చే జూన్ 2వ తేదీలోగా 64వేల మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. తాండూరు రెవిన్యూ డివిజన్‌లోని తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట్ మండలాల్లో మొత్తం 41586 మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బషీరాబాద్ మండలానికి 5284 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.2.81కోట్ల, బొంరాస్‌పేట్‌లో4904 మరుగుదొడ్ల నిర్మాణానికిరూ. 2.59 కోట్లు, దౌల్తాబాద్ మండలానికి 5959 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 2 కోట్ల 56 లక్షలు, కొడంగల్ మండలానికి 6011 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3 కోట్ల 17 లక్షలు, పెద్దేముల్ మండలానికి 5875 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 2 కోట్ల 68 లక్షలు, తాండూరు మండలానికి 7569 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 5 కోట్ల 32 లక్షలు, యాలాల మండలానికి 5984 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 3 కోట్ల 48 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో మొత్తం 6258 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. మరో 34,623 మరుగుదొడ్ల నిర్మాణం ప్రగతిలో ఉందన్నారు. ఇప్పటి వరకు నిర్దేశించిన లక్ష్యంలో 15 శాతం మరుగుదొడ్లను నిర్మించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ప్రారంభం కాని మరుగుదొడ్లతో పాటు ప్రగతిలో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయించాలని సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణంలో సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

85 శాతం మొక్కలు బతకాలి..
హరితహారం మొక్కలను నాటించడంలో గ్రామ కార్యదర్శులు శ్రద్ద చూపాలని డ్వామా పీడీ కోరారు. నాటిన మొక్కల్లో కనీసం 85 శాతం మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో వచ్చే జూన్ నెలలో ప్రారంభించే హరితహారం కార్యక్రమం ద్వారా 2 కోట్ల 75 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. చిన్న పంచాయతీల్లో 30 వేల వరకు, పెద్ద పంచాయతీల్లో 40 వేల వరకు మొక్కలు నాటించాలని సూచించారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు వారంలో కొన్ని రోజులు పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పీడీ తెలిపారు. ఇందుకు ఫర్నిచర్‌ను కూడా అందిస్తామన్నారు. పంచాయతీకి వచ్చిన ప్రజలకు హరిత హారం, మరుగుదొడ్లపై అవగాహన కల్పించాలని, వారికి ఎదురవుతున్న ఇబ్బందులు గుర్తించి పరిష్కారం సూచించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీడీ వేణుగోపాల్ గుప్తలు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...