జడ్పీపీఠంపై గులాబీ జెండా ఎగురేద్దాం


Sun,April 21, 2019 11:36 PM

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వికారాబాద్ జడ్పీపీఠంపై టీఆర్‌ఎస్ జెండా ఎగురవేసి తిరుగులేని విజయాన్ని అందించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లాలోని ఎమ్మెల్యేలు యాదయ్య, ఆనంద్, మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆకాంక్షిస్తున్న విధంగా జిల్లాలోని 18 జడ్పీటీసీ, 221 ఎంపీటీసీలను గెలిపించుకొని సత్తా చాటి తిరుగులేని శక్తిగా మరో మారు ఆవిర్భవించాలని తెలిపారు. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ పార్టీని మరో మారు విజయదుందుబిని కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు.

పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ నిర్ణయిస్తున్న నేపథ్యంలో పార్టీ అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలని సూచించారు. గెలిచే వారిని ఎంపీటీసీ అభ్యర్థిగా ఎంపిక చేయడంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అందరికీ ఆదర్శంగా కావాలన్నారు. గత కొంత కాలంగా ఎన్నికల కోడ్ నిరంతరంగా ఉండటంతో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు నిలిచిపోయిన తరుణంలో ఎన్నికల అనంతరం వేగంగా ప్రగతి వైపు పయనించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పక్ష పార్టీలు ఎన్నికల వేళల్లో చేసే విషప్రచారం, తప్పుడు ప్రచారాలను గట్టిగా ప్రతిఘటించి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి కార్యకర్త మన నాయకుడు సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లతో అభ్యర్థుల విజయం కోసం ప్రతి ఒక్కరూ పట్టుదళతో పని చేయాలన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...