పరిషత్ ఎన్నికలకు చేయాలి


Sun,April 21, 2019 11:36 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లాలో జరుగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా చేసుకోవాలని కలెక్టర్ మస్రత్‌ఖానమ్‌ఆయేషా అధికారులకు సూచించారు. ఆదివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మస్రత్‌ఖానమ్‌ఆయేషా మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంగా ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఆయా మండలాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 25వ తేదీన నామినేషన్ల పరిశీలన, 26వ తేదీన అప్పీలు, 27న తిరస్కరణ, 28న ఉప సంహరణ ఉంటుందని తెలియజేశారు. జిల్లాలో మొదటి విడుత ఎన్నికలు పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు, తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్‌పేట మండలాల్లో వచ్చే మే 6న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎన్నికల పరిశీలకులుగా శ్రీలక్ష్మీని నియమించినట్లు కలెక్టర్ తెలియజేశారు. అధికారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పని చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీసీఈవో దేవసహాయం, జిల్లా ఎస్పీ నారాయణ, డీఆర్‌వో మోతీలాల్, డీఆర్‌డీవో జాన్సన్, ఆర్డీవోలు విశ్వనాథం, వేణుమాదవరావు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...