ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలి


Sun,April 21, 2019 11:36 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : అన్ని మతాల సారం ఒక్కటే అందరు సోదర భావంతో జీవన శైలిని కొనసాగించి జాతీ సమాఖ్యతకు పాటు పడాలని మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆలంపల్లి వద్ద శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభస్వామి స్వాగతతోరణ ఆవిష్కరణ మహోత్సవాన్ని ఆలంపల్లి కెంపెనమఠాధిపతి చెన్నభసవప్రభు, అనంతపద్మనాభస్వామి ఆలయ ట్రస్టీ సీతారామచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాల సారం ఒక్కటేనని తెలియజేశారు. ఎవరు మతానికి వారు ప్రాధాన్యతనిచ్చుకుంటూ అందరూ సోదర భావంతో కలిసి జాతీ సమాఖ్యతకు పాటు పడాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆనంద్, యాదయ్యలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలోపల భక్తి భావం పెంపొందించుకోవాలని తెలిపారు. ప్రస్తుత కాలంలో మనుషుల్లో స్వార్థం పెరిగిపోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపద్మనాభస్వామి స్వాగత తోరణాన్ని నిర్మాణం చేసిన బసవలింగంపటేల్ వారి కుటుంబ సభ్యులు స్వాగత తోరణం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, జడ్పీటీసీ ముత్తహర్‌షరీఫ్, నాయకులు అనంత్‌రెడ్డి, శుభప్రద్‌పటేల్, గాండ్ల ఉమాశంకర్, విజయ్‌కుమార్, కౌన్సిలర్లు శేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సత్యమ్మ, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...