దాల్ మిల్లులను సందర్శించిన విద్యార్థులు


Sun,April 21, 2019 11:36 PM

తాండూరు, నమస్తే తెలంగాణ: తాండూరు ప్రాంతంలోని కంది పంట సాగుతో తయారు చేస్తున్న కంది పప్పు అత్యంత నాణ్యతగా ఉంటుందని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ వెల్లడించారు. పట్టణంలోని దాల్ మిల్లులను ప్రొఫెసర్ జయశంకర్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలో ప్రతి ఏటా కనీసం లక్ష ఎకరాల్లో ప్రధాన పంటగా రైతులు కంది పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. వాతావరణం అనుకూలంగా ఉంటే ఎకరానికి చల్కా నేలల్లో 3 నుంచి 4, నల్లరేగడి నేలల్లో 5 నుంచి 8 క్వింటాళ్ల వరకు కందులు దిగుబడి అవుతాయని తెలిపారు. కందులను కోతల తరువాత మార్కెట్‌కు తరలించిన తరువాత వ్యాపారులు తమ మిల్లులకు కందులను కొనుగోలు చేసి తరలిస్తారని తెలిపారు.

కంది పప్పు తయారీకి సంబంధించిన మిల్లులు తాండూరులో 15 వరకు ఉన్నాయని అయితే వీటిలో ఐదు మాత్రం పనిచేస్తున్నాయని తెలిపారు. క్వింటాలు కందులను పప్పుగా మారిస్తే 60 నుంచి 70 కిలోల పప్పు ఉత్పత్తి అవుతుందన్నారు. కేవలం వ్యాపారులు మాత్రమే తమ మిల్లుల్లో పప్పుగా తయారు చేసి విక్రయిస్తారని, తాండూరు కంది పప్పు దేశంలోని పలు రాష్ర్టాలకు సరఫరా అవుతుందన్నారు. పిండిమరల్లో కూడా ఇలా చేసిన కందులను పప్పుగా మార్చుకోవచ్చన్నారు. ర్ర కందుల తెల్లని కందులు మరింత నాణ్యతతో పాటు తయారు చేసిన పప్పు ఎక్కువ సమయం నిల్వ ఉంటుందన్నారు. రైతులు తాము పండించిన కంది పంటను తామే పప్పుగా మార్చేందుకు ప్రభుత్వ సహకారం తీసుకుని రైతులు ఆర్థికంగా ఎదుగాలని విద్యార్థులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం ఇన్‌చార్జి డాక్టర్ లావణ్య, డాక్టర్ మీనా, డాక్టర్ శివాని తదితరులున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...