ఘనంగా ఈస్టర్ వేడుకలు


Sun,April 21, 2019 11:35 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ: ఘనంగా ఈస్టర్ వేడుకలను క్రైస్తవ సోదరులు భక్తి భావంతో నిర్వహించుకున్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఘనంగా ఈస్టర్ వేడుకలను నిర్వహించుకొని చర్చీల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈస్టర్ వేడుకల్లో బాగంగా వికారాబాద్ పట్టణ సమీపంలోని కొంపల్లి మహిమ మినిస్ట్రీస్ అనాథ ఆశ్రమంలో వికారాబాద్ మెథడిస్ట్‌కు చెందిన క్రైస్తవ సోదరులు వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అనాథ పిల్లలతో, వృద్ధులతో ఆప్యాయతతో గడిపి వారిని ఆనందింపజేశారు.
బంట్వారం: మండలంలోని బొపునారం, తొరుమామిడి, బస్వపూర్, బంట్వారం తదితర గ్రామాల్లో క్రైస్తవ సోదరులు ఈస్టర్ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. వేకువ జామునే ఆయా గ్రామాల్లో ఉన్న శిలువ వద్దకు కుటుంబ సమేతంగా కొవ్వొత్తులతో ర్యాలీగా వెళ్లి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయా ప్రదేశాల్లో క్రీస్తూ బోధకులు ప్రత్యేక వ్యాక్యాలు వినిపించారు. అనంతరం అక్కడే ఫలహారాన్ని స్వీకరించి తమ ఇండ్లకు వెళ్లారు.
మోమిన్‌పేట : ప్రపంచానికి ఏస్తుకీస్తు శాంతి మార్గాన్ని చూపారని ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసినప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుందని మోమిన్‌పేట మండల చర్చి ఫాస్టర్ ఆశీర్వాదం అన్నారు. ఈస్టర్ పర్వదినం సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల్లో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. మోమిన్‌పేట చర్చిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక ప్రార్థనలు, ఏసునామస్మరణ, ఫాస్టర్లు చెప్పే విషయాలను వింటు క్రైస్తవ సోదరులు పండుగను ఘనంగా జరుపుకున్నారు.
నవాబుపేట : మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈస్టర్ పండుగగా క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. గ్రామాలకు సమీపంలో ఉన్న శిలువ గుట్టగా పిలువబడే ప్రాంతానికి చేరుకొని భక్తులు ఏసుక్రీస్తు బోధనలు పాస్టర్లు వినిపించడంతో ఆస్వాదించారు. మండల పరిధిలోని గుబ్బడి ఫత్తేపూర్, గేటువనంపల్లి, చిట్టిగిద్ద, మాదిరెడ్డిపల్లి, ఎక్‌మామిడి, గ్రామాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...