మోగిన నగారా


Sat,April 20, 2019 11:30 PM

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను విడుతల వారీగా నిర్వహించేందుకు నిర్ణయించారు. జిల్లాలో మూడు విడుతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించనున్నారు. తొలి విడుత ఎన్నికలను మే 6న, రెండో విడుత మే 10న, మూడో విడుత మే 14న నిర్వహించనున్నారు. అయితే రేపు తొలి విడుత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలకానుంది. అదేవిధంగా రెండో విడు త ఎన్నికలకు సంబంధించి ఈ నెల 26న, మూడో విడుత ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను వెల్లడించిన అనంతరమే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను వెల్లడించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో మే 27న ఓట్ల లెక్కింపుతో పాటు అదే రోజు స్థానిక సంస్థల ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు రూ.1.50 లక్షలు, జడ్పీటీసీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చును రూ.4 లక్షలుగా రాష్ట్ర ఎన్నికల సం ఘం నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. అయితే జిల్లాలో స్థానిక సం స్థల ఎన్నికలకుగాను 1250 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, జిల్లావ్యాప్తంగా 6,14,029 మంది ఓటర్లున్నారు.

జిల్లాలో మూడు విడుతల్లో ఎన్నికలు...
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను మూడు విడుతల్లో నిర్వహించనున్నారు. జిల్లాలో 18 జడ్పీటీసీలు, 221 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడుతలో ఏడు జడ్పీటీసీలకు, 97 ఎంపీటీసలకు ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడుతలో వికారాబాద్, తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పరిగి, పూడూరు, కులకచర్ల, దోమ, కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడుత ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తొలి విడుత ఎన్నికలకు ఈ నెల 22 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారంభంకానుంది. నామినేషన్లను దాఖలు చేసేందుకుగాను ఈ నెల 24 వరకు ఎన్నికల సంఘం గడువిచ్చింది. ఈ నెల 25న నామినేషన్ల పరిశీలన, 27న నామినేషన్ల తిరస్కరణ, 28న లోగా నామినేషన్ల ఉప సంహరణకు గడువిచ్చింది. అదేవిధంగా రెండో విడుత ఎన్నికల్లో భాగంగా 4 జడ్పీటీసీలకు, 53 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రెండో విడుతలో యాలాల, తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. రెండో విడుత ఎన్నికలకు ఈ నెల 26న నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 26 నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభంకానుంది, నామినేషన్లను దాఖలు చేసేందుకు ఆ ఖరు తేదీ ఈ నెల 28 వరకు గడువిచ్చింది. ఈ నెల 29న నామినేషన్ల పరిశీలన, మే1 నామినేషన్ల తిరస్కరణ, మే 2న నామినేషన్ల ఉప సంహరణకుగాను రాష్ట్ర ఎన్నికల సంఘం గడువిచ్చింది. అదేవిధంగా మూడు విడుత ఎన్నికలకు సంబంధించి 7 జడ్పీటీసీల కు, 71 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మూడో విడుత ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 30 నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభంకానుంది. నామినేషన్లను దాఖలు చేసేందుకుగాను మే 2 వరకు ఆ ఖరు తేదీగా నిర్ణయించారు. మే 3న నామినేషన్ల పరిశీలన, మే 5న నామినేషన్ల తిరస్కరణ, మే 6న నామినేషన్ల ఉప సంహరణకు గడువిచ్చింది. అయితే జడ్పీటీసీ అభ్యర్థులు ఆయా మండలాల్లోనే నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. అదే ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్వీకరించేందుకుగాను ప్రతి రెండు, మూడు మండలాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు.

ఎన్నికలకు 5868 పోలింగ్ సిబ్బంది సిద్ధం...
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు జరుగనున్నాయి. అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకంతో పాటు పీవో, ఏపీవో, ఇతర పీవో అధికారులను నియమించడంతో పాటు శిక్షణ కార్యక్రమం కూడా పూర్తయ్యింది. జిల్లాలో జరుగనున్న మూడు విడుతల ఎన్నికల నిర్వహణకు 5868 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. అయితే ప్రతి మండలంలో 20 శాతం అదనంగా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ సిబ్బందిని నియమించారు. తొలి విడుత ఎన్నికలకు గాను 516 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయగా 609 మంది ప్రిసైడింగ్ అధికారులు, 609 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 2436 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణలో పాల్గొననున్నారు. రెండో విడుత ఎన్నికల్లో 311 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయగా 366 మంది ప్రిసైడింగ్ అధికారులు, 366 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 1464 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు, మూడో విడుత ఎన్నికల్లో 423 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయగా 492 మంది ప్రిసైడింగ్ అధికారులు, 492 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 1968 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు.

జిల్లాలో 6,14,029 మంది ఓటర్లు...
జిల్లాలో 6,14,029 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 3,07,892 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 3,06127, ఇతరలు 10 మంది ఓటర్లు ఉన్నారు. బంట్వారంలో 16,735 మంది ఉండగా అందులో పురుషులు 8,360 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 8,375 మంది ఉన్నారు. బషీరాబాద్‌లో 35,757 మంది ఉండగా పురుషులు 17,237 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 18,520 మంది ఓటర్లున్నారు. బొంరాస్ పేటలో 39,114 మంది ఉండగా పురుషులు 19,620 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 19,493 మంది ఉన్నారు. ధారూరు 32,926 మంది ఉండగా పురుషులు 16,538 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 16,388 మంది ఉన్నారు. దోమ మండలంలో 39,027 మంది ఉండగా పురుషులు 19,838 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 19,189 మంది ఓటర్లున్నారు. దౌల్తాబాద్‌లో 38,414 మంది ఉండగా పురుషులు 19,025 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 19,388 మంది ఓటర్లున్నారు. కొడంగల్‌లో 28,585 మంది ఓటర్లు ఉండగా పురుషులు 14,261 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 14,324 మంది ఉన్నారు. కోట్‌పల్లి మండలంలో 20,352 మంది ఉండగా పురుషులు 10,199 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 10,153 మంది ఓటర్లున్నారు. కులకచర్లలో 44,423 మంది ఉండగా పురుషులు 22,617 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 21,804 మంది ఉన్నారు. మర్పల్లిలో 43,297 మంది ఉండగా పురుషులు 22,415 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 20,882 మంది ఉన్నారు. మోమిన్‌పేట్‌లో 37,020మంది ఉండగా పురుషులు 18,727 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 18,292 మంది ఉన్నారు. నవాబుపేటలో 33,945 మంది ఉండగా పురుషులు 17,437 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 6,508 మంది ఉన్నారు. పరిగిలో 34,373 మంది ఓటర్లు ఉండగా పురుషులు 17,353 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 17,020 మంది ఉన్నరు. పెద్దేముల్ మండలంలో 35,876 మంది ఉండగా పురుషులు 17,711 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 18,164 మంది ఉన్నారు. పూడూరులో 38,117 మంది ఉండగా పురుషులు 19,429 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 18,687 మంది ఉన్నారు. తాండూరులో 40,062 మంది ఉండగా పురుషులు 19,673 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 20,388 మంది ఉన్నారు. వికారాబాద్‌లో 21,636 మంది ఉండగా పురుషులు 10,861 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 10,775 మంది ఉన్నారు. యాలాలలో 34,370 మంది ఉండగా పురుషులు 16,591 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 17,776 మంది ఓటర్లు ఉన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...