పరిషత్ ఎన్నికల్లోనూ విజయం ఖాయం


Sat,April 20, 2019 11:29 PM

కొడంగల్, నమస్తే తెలంగాణ : స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయానికి ప్రతి కార్యకర్తలు ఓ సైనికుడిలా కృషి చేసి జిల్లాలో టీఆర్‌ఎస్ జెండాను ఎగరవేద్దామని మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని కేఎస్‌వీ ఫంక్షన్ హాల్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల అభ్యున్నతికి పాటుపడుతూ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగుతుందని, గత ఎమ్మెల్యే, సర్పంచ్ ఎన్నికల్లో నిరూపణ కాబడినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని 18 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకొని జడ్పీ స్థానాన్ని సీఎం కేసీఆర్‌కు కానుకగా అందిద్దామని కార్యకర్తలను కోరారు. జిల్లాలోని అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు మెజారిటీ దిశగా ముందుకు సాగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేద్దాం
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిలకు ప్రతిష్ఠ్ఠాత్మకంగా తీసుకొని నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేద్ద్దామని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డిలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా శనివారం స్థానిక కేఎస్‌వీ ఫంక్షన్ హాల్‌లో మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని 41 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ స్థానాలోని అభ్యర్థుల ఘన విజయంతో టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడులా కృషి చేయాలని తెలిపారు. కొడంగల్ మండల పరిధిలో 11 ఎంపీటీసీ, బొంరాస్‌పేటలో 15 ఎంపీటీసీ, దౌల్తాబాద్‌లో 15 ఎంపీటీసీ స్థానాలతో పాటు 3 జడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు తెలిపారు. ఇందుకు గాను గ్రామాల వారిగా రెండు స్థానాలకు రిజర్వేషన్‌కు ఖరారు కాబడ్డాయని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో తమలో తాము పోటీ పడి మెజారిటీ క్షీణించిందని, ఓడిన వారికి ప్రత్యేక స్థానాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పూర్తి కృషి కొనసాగుతుందని, ఇదే కాకుండా టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొడంగల్‌ను దత్తత తీసుకోవడం పట్ల నియోజకవర్గంలో ప్రతి మూడు నెలలకోసారి ప్రత్యేక సమావేశాన్ని కేటీఆర్ సమక్షంలో నిర్వహించడం, అభివృద్ధిని సమీక్షంచుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీపీ ముద్దుప్ప దేశ్‌ముఖ్, ఎంపీటీసీలు ఏన్గుల భాస్కర్, నందారం రాజేందర్, మండల పార్టీ అధ్యక్షుడు గోడల రాంరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ, జడ్పీటీసీలు బాల్‌సింగ్, వైస్ ఎంపీపీ నర్సిములు, యాదగిరి, మహేందర్, లక్ష్మణ్‌రావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...