స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు


Sat,April 20, 2019 11:29 PM

రంగారెడ్డి జిల్లా,నమస్తే తెలంగాణ: మండల,జిల్లా పరిషత్ పోరులో పోటీ చేసే పార్టీ, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు.జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థులకు 60 గుర్తులు, ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థులకు 30గుర్తులను ప్రస్తుతానికి ఎన్నికల సంఘం ఖరారు చేసింది. అభ్యర్థులు నామినేషన్‌ను ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రమే గుర్తులను అభ్యర్థులకు ఎన్నికల అధికారులు జాబితాను అందజేస్తారు. వివిధ రాజకీయ పార్టీలకు గుర్తులు,స్వతంత్రుల గుర్తులను ఎన్నికల కమి విడుదల చేసింది. ఈ గుర్తులు పల్లె జీవన విధానానికి దర్పణం పట్టే విధంగా ఉన్నాయి. ఈ గుర్తులు గ్రామీణ పల్లెలో ప్రజలు దైనందిన జీవితంలో వినియోగించే వస్తువులు కావడం విశేషం.

అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం..
సాధారణంగా ఎన్నికలంటే పార్టీ గుర్తులు ప్రాచుర్యంలోకి వస్తాయి. స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలబడితే స్వచ్ఛందంగానే ఎన్నికల సంఘం గుర్తుల కేటాయింపు చేస్తుంది. ఎన్నికల సంఘం ఆయా గుర్తులను అభ్యర్థులకు కేటాయించింది. ఈసారి పరిషత్ ఎన్నికల్లో అందుబాటులోకి తీసుకువచ్చిన ఎన్నికల గుర్తులు ఆసక్తి కల్గిస్తున్నాయి. అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు అన్నీ సగటు మనిషి జీవనశైలికి అద్దపడుతున్నాయి. నిజ జీవితంలో నిత్యం మనం వాడే వస్తువులు, పండ్లు,క్రీడా వస్తువులు,అలంకరణగా ధరించే నగలు, ఇతరాత్ర వాటన్నింటిన్నీ ఎన్నికల సంఘం ప్రత్యేకంగా గుర్తించింది. ఇవే ఇప్పుడు పరిషత్ పోరులో కీలకం కానున్నాయి. అభ్యర్థుల గెలుపోటములనూ ఈ గుర్తులే తలకిందులు చేయడానికి నిర్ణయించబోతున్నాయి. కొన్ని గుర్తుల కోసం ఇద్దరు కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీపడితే లక్కీడీప్ తీసి గుర్తులను కేటాయిస్తారు.

ఎంపీటీసీ గుర్తులు
ఆపిల్, క్యారమ్‌బోర్డు, కోటు, డైమాండ్, కవరు, పిల్లనగ్రోవి, ఫుట్‌బాల్,గ్యాస్ సిలెండర్, గిఫ్ట్‌ప్యాక్, హెడ్ కెటిల్, పోస్ట్ డబ్బా, మూకుడు, రేజర్, కత్తెర, బూటు, సాక్స్, టేబులు, టెలిఫోను, ట్రంపెట్, ఉన్నాయి.

జడ్పీటీసీ గుర్తులు
బీరువా, గాజులు, పండ్ల బుట్ట, బాటరీ టార్చ్, బ్యైనాక్యులర్స్, బిస్కట్, నల్ల బోర్డు, సీసా, పెట్టె, బ్రెడ్, కెమెరా, క్యాన్, చెయిన్, చెప్పులు, కొబ్బరి తోట, మంచము, కప్పు మరియు సాసరు, కటింగ్ ప్లేయర్, డిష్ యాంటెనా, డ్రిల్ మెషిన్, విద్యుత్ స్థంబం, గౌను, గరాటా, గ్యాస్ పొయ్యి, గాజు గ్లాస్, గ్రామోఫోన్, ద్రాక్ష పండ్లు, హార్మోనియం, హెలికాప్టర్, హాకీ కర్ర మరియు బంతి, ఐస్ క్రీమ్, బెండకాయ, లేడి పర్స్, అగ్గి పెట్టె, నెక్ టై, ప్యాంటు, పెన్ డ్రైవ్, అనాసపండు, కుండ, ప్రెషర్ కుక్కర్, రిఫ్రిజిరేటర్, ఉంగరము, సేప్టీ పిన్ను, నౌక, సితార, సోఫా, స్పానర్, స్టెతస్కోప్, స్టూల్, ఊయల, స్విచ్ బోర్డు, టూత్ బ్రష్, టూత్ పేస్టు, త్రిభుజము, టైపురైటర్, టైర్స్, వయోలిన్, వాటర్ ట్యాంక్, చాట, ఊలు మరియు సూది...తదితర గుర్తులు కేటాయించారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...