శ్రీ అనంతపద్మనాభస్వామి స్వాగత తోరణం ఆవిష్కరించనున్న మంత్రి మల్లారెడ్డి


Sat,April 20, 2019 11:29 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అలంపల్లి శ్రీ అనంత స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి స్వాగత తోరణంను ఏర్పాటు చేశారు. ఈ స్వాగత తోరణం ప్రారంబోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణ శాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డి చేతుల ప్రారంబించనున్నారు. ఆదివారం ఉదయం గం.11: 15 నిమిషాలకు ప్రారంబోత్సవం నిర్వహించనున్నారని శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి స్వాగత తోరణం నిర్మాణ కర్త నూలి బస్వలింగం పటేల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈకార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఆలంపల్లి కెంపెన మఠాధిపతి డా. చెన్నబసవ స్వామి, ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ మంత్రులు చంద్రశేఖర్, ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణలు హాజరు కానునున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గ్గొని కార్యక్రమం విజయవంతం చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించగలరని కోరారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...