దాహం తీరింది..


Sat,April 20, 2019 12:23 AM

- పూర్తయిన మిషన్ భగీరథ పనులు..
- ఆవాసాలకు, 4 మున్సిపాలిటీలకు తాగునీరు

వికారాబాద్, నమస్తే తెలంగాణ : ఇంటింటికీ స్వచ్ఛమైన శుద్ధి జలాలతో సురక్షిత తాగు నీరు అందించాలనే బృహోత్తర ప్రణాళికతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథతో ప్రజలకు నీరందించాలనే గొప్ప సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఈ పథకంతో గ్రామీణ ప్రజలకు ఇంటింటికీ నీరు అందించి గ్రామీణ మహిళల నీటి కష్టాలు తీర్చేవరకు ఎన్నికల్లోకి రానని కరాఖండిగా తెలియ జేయడం జరిగింది. సీఎం కేసీఆర్ చెప్పిన ప్రాజెక్టుద్వారా పనులను పూర్తి చేసి ఇంటింటికీ నీరు అందించి సఫలీకృతులయ్యాకే ఎన్నికల్లోకి వచ్చి ఎన్నికల్లో గణవిజయం సాధించటం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీరాయి. ప్రస్తుతం మిషన్ భగీరథ నీల్లే ప్రజలకు ప్రత్యామ్నాయంగా కాకుండా శాశ్వతంగా నీటి సమస్య తీరింది. గత రెండు సంవత్సరాలుగా వర్షాలు సరిగా భూగర్భజలాలు అంతరించి పోవడంతో గత అక్టోబర్ ముందుగానే గ్రామాల్లో నీటి కరువు ప్రారంభమైంది.మిషన్‌భగీరథతో నీరుపుష్కలంగా వస్తుండటంతో నీటి తెలియడం వికారాబాద్ జిల్లాలో రూ.1,187 కోట్లతో 974 ఆవాసాలకు, నాలుగు మున్సిపాల్టీలకు తాగునీరు అందించటం కోసం పనులు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు 69 ఓవర్ హెడ్‌ట్యాంక్‌లు నిర్మాణం చేయటం జరిగింది. 2,598 కిలో మీటర్ల పైపులైన్ నిర్మాణ పనులు పూర్తి చేసి 954 ఆవాసాలకు నాలుగు మున్సిపాల్టీలకు సురక్షిత మంచినీరు అందించటం జరుగుతుంది. మరో 20గ్రామాలకు అక్కడక్కడ పైపులైన్ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం దాదాపు పూర్తి కావస్తుంది. ఇవి పూర్తి చేసుకొని గ్రామాల్లోని ఇంటింటికీ కనెక్షన్ ఇచ్చినటువంటి పైపులకు నల్లాలు బిగించేందుకు సమాయత్తం అవుతున్నారు. 1,98,793 కుటుంబాలు ఉండగా ఇప్పటికే 1,80, 793 కుటుంబాలకు నీరు చేరుతుంది. 230 కిలోమీటర్ల దూరం నుంచి లిఫ్టింగ్ ద్వారా జిల్లాలోని రాఘవపూర్, కొడంగల్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లకు నీరు చేర్చి అక్కడి నుంచి శుద్ధిజలాలను జిల్లాలోని ఆవాసాలకు అందించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ పనుల్లో భాగంగా రూ. 1,070 కోట్లతో పైపులైన్ పనులు, ఓహెచ్‌బీఆర్‌లు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నిర్మించగా, రూ. 413 కోట్లతో ఇంట్రావిలేజ్ పనులను చేపట్టారు.

వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, బషీరాబాద్, బొంరాస్‌పేట, బంట్వారం, కోట్‌పల్లి, మోమిన్‌పేట, పరిగి, ధారూరు ఇలా అనేక మండలాల్లోన్ని గ్రామాల్లో నీటి ప్రజలు అల్లాడుతూ తల్లడిల్లేవారు. రాత్రుల్లో నిద్రలు పొలాల్లోని బోరుబావుల నుంచి నీటిని తీసుకుచ్చుకునేవారు. గ్రామీణ ప్రజల నీటి కష్టాలు తీరాయి. గతంలో అక్టోబర్ మాసం నుంచి నీటి కష్టాలు ప్రారంభం అయ్యోవి ముఖ్యంగా కేసీఆర్ గ్రామీణ ప్రజలకు ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి జలాలు అందించి నీటి కష్టాలు తీర్చాలనే భృహోత్తర పథకానికి శ్రీకారం చుట్టి విజయం సాధించారు. కలలు గన్న విధంగా మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీటితో గ్రామాల్లో మహిళల కష్టాలు తీరుతున్నాయి. ఇంటింటికీ శుద్ధి నీరు అందించడం వల్ల గ్రామీణ ప్రజలకు కలుషితమైన నీరు లేకుండా రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఈ పథకాన్ని తీసుకరావడం జరిగింది. గ్రామాల్లో ఇప్పటికే నీటి కరువు తాండవం చేసే పరిస్థితి నెలకొంది. సరైన విధంగా వర్షాలు కురువకపోవడంతో భూమిలోపల భూ గర్భజలాలు కూడా అడుగంటిపోయాయి. ఈ తరుణంలో మిషన్ భగీరథ నీరు రావడంతో నీరు రావడంతో గ్రామాల్లో తాగునీటి కష్టాలు మాయమయ్యాయి. ఏ గ్రామంలో చూసిన ఇండ్ల ముందు మిషన్ భగీరథ నల్లా పైపులే దర్శనమిస్తున్నాయి. వీటి ద్వారా ప్రజలు తాగు నీటిని ఎలాంటి చింత లేకుండా తీసుకెళ్తున్నారు.

వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీలకు 9ఎంఎల్‌డీ మిషన్ భగీరథ నీరు
వికారాబాద్ మున్సిపాలిటీకి 9 ఎంఎల్‌డీ, తాండూరు మున్సిపాలటీలకు 9 ఎంఎల్‌డీ నీటిని అందించడం జరుగుతుంది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ సరైన చర్యలు చేపట్టకపోవడంతో 9ఎంఎల్‌డీ నీటిని తీసుకునే సామర్థ్యం లేక 6ఎంఎల్‌డీ నీటిని మాత్రమే తీసుకోవడం జరుగుతుందని మిషన్ భగీరథ అధికారులు తెలియజేయడం జరుగుతుంది. 9ఎంఎల్‌డీ నీటిని అందించిన పబ్లిక్ హెల్త్ వారు పట్టణంలో సరైన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోకపోవడంతో 6ఎంఎల్‌డీ నీటిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అన్ని మున్సిపాల్టీల్లో, అన్ని గ్రామాల్లో ఇప్పటికే మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి సమవృద్ధిగా నీరు అందించడంలో గ్రామాల్లో, పట్టణాల్లో నీటి సమస్యకు సరైన పరిష్కారం లభించింది. కొన్ని కొన్ని సమస్యల వలన రహదారుల నిర్మాణం జరుగుతుండటం వలన అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో మాత్రం పనులు నత్తనడకన నడుస్తున్నాయి. వీటిని కూడా త్వరితగతిన పరిష్కారం చూపి జిల్లాలో సంపూర్ణంగా నీటిని అందించేందుకు మిషన్ భగీరథ అధికారులు ముందుకు సాగుతున్నారు.

కష్టాలు తీర్చిన దేవుడు కేసీఆర్
అనేక సంవత్సరాలుగా మహిళలు నీటి కోసం కరువు వచ్చిందంటే ఎంతో బాధను అనుభవించేవాళ్లం. నీటి కోసం కుటుంబంలోని అందరిని తీసుకెళ్లి దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకునే వా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చిన ప్రజలకు నీటి కష్టాలు తీర్చలేక పోయారు. సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ఆలోచించి నీటి కష్టాలు తీర్చి ఇంటింటికి నీరు ఇవ్వడం గొప్ప వరంగా మారింది. ముఖ్యంగా మహిళల కష్టాలు తీర్చిన కేసీఆర్ .
- సుధాకర్, ఇస్సాఖాన్‌భాగ్, వికారాబాద్

నీరు సమవృద్ధిగా రావడంతో ఎలాంటి దిగులులేదు
గతంలో వేసవీ కాలం వచ్చిందంటే పనులు సైతం వదులుకొని వ్యవసాయా పొలాలకు వెళ్లి రాత్రనక, పగలనక నీటి కోసం నరకయాతన అనుభవించే పరిస్థితి ఉండేది. గ్రామంలో రెండు,మూడు బోర్లు ఉంటే వాటిలో కూడా మామూలుగా నీరు రావడంతో, గ్రామ ప్రజలమంత గంటల తరబడి బోర్ల వద్ద నిరీక్షించి సరిపోయిన నీరు లేక పోయిన కాలం వెల్లదీసుకునేవారిమి. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, గ్రామీణ ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు శాశ్వత పథకం ఆలోచించి మిషన్‌భగీరథ ద్వారా సమవృద్ధిగా నీరు అందించి గ్రామీణ ప్రజలకు ఎంతో మేలు చేశారు. ఏ ప్రభుత్వాలు కూడా శాశ్వతంగా నీటి సమస్యను తీర్చిన పాపనపోలేదు.
- బాలమణి, రాంపూర్, కోట్‌పల్లి

అన్ని గ్రామాలకు నీటి సౌకర్యం
జిల్లాలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి అన్ని గ్రామాలకు సరైన విధంగా నీటి సౌకర్యం కల్పించి శుద్ధి జలాలను అందించడం జరుగుతుంది. 974 ఆవాసాలకుగాను, 20 గ్రామాలు మినహా ఇంచి అన్ని గ్రామాల్లో పుష్కలంగా మిషన్ భగీరథ జలాలను అందించడం జరుగుతుంది. ప్రస్తుతం గ్రామాల్లో మిషన్ భగీరథ నీటితోనే నీటి సమస్యలు తీరుపోయాయి. ఈ 20 గ్రామాల్లో కూడా ఈ 10,20 రోజుల్లో నీటిని అందిస్తాం. వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీలకు 9ఎంఎల్‌డీ చొప్పున నీటిని అందించడం జరుగుతుంది. వికారాబాద్‌లో మాత్రం సామర్థ్యం లేక 6ఎంఎల్‌డీ నీటిని మాత్రమే తీసుకుంటున్నాం. కూడా ప్రబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి మిషభన్ భగీరథ పైపులైన్‌లకు అక్రమంగా కనెక్షన్లు ఇచ్చుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేయబడుతాయి.
- మిషన్ భగీరథ డీఈ

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...