ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర


Sat,April 20, 2019 12:22 AM

మొయినాబాద్ : వీర హనుమాన్ విజయ యాత్ర ఎంతో వైభవంగా నిర్వహించారు. జై హనుమాన్..జై శ్రీరాం అనే నినాదాలతో మండల కేంద్రం మార్మోగింది. హనుమాన్ భారీ విగ్రహాన్ని ట్రాక్టర్‌పై ప్రతిష్టించి చిలుకూరు బాలాజీ దేవాలయం నుంచి మొయినాబాద్ మండల కేంద్రం వరకు శోభ యాత్ర నిర్వహించారు. భజరంగ్‌దళ్ కార్యకర్తలు కాషాయ దుస్తులు వేసుకుని, తలకు కాషాయ రంగు పాగా పెట్టుకుని శోభ యాత్రలో పాల్గొన్నారు. హిమాయత్‌నగర్ చౌరస్తా నుంచి మొయినాబాద్ వరకు ఉన్న హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై హనుమాన్ శోభయాత్ర నిర్వహించడంతో రహదారి అంతా కాషాయమయమైంది. వెంబడి హనుమాన్, శ్రీరాం నినాదాలతో హోరెత్తించారు. డీజే పాటలతో భజరంగ్‌దళ్ కార్యకర్తలు, హిందువాదులు డ్యాన్స్‌లు చేశారు. వివిధ గ్రామాల నుంచి యువకులు బైక్‌లతో ర్యాలీగా చిలుకూరు బాలాజీ వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి మొయినాబాద్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.

హిందు ధర్మాన్ని ప్రతి ఒక్కరు కాపాడాలి
భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడ లేవని, మన దేశ హిందూ ధర్మాన్ని కాపాడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వీహెచ్‌పీ ప్రతినిధి కసిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడ లేదని, విదేశీయులు కూడ మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తున్నారని చెప్పారు. విదేశీ సంస్కృతికి అలవాటు పడి దేశ సంసృ్కతి , సాంప్రదాయాలను విస్మరించరాదని పేర్కొన్నారు. మనుమాన్ గ్రామ ప్రజలకు సేవకునిగా ఉంటారని, అందుకే ప్రతి పల్లెలో హనుమాన్ దేవాలయం ఉంటుందని చెప్పారు. చంద్రం కలర్ ఆయనకు ఎంతో ఇష్టమని, అందకే ఆయనకు ఒళ్లంతా చంద్రం కలర్ వేయడం జరుగుతుందని చెప్పారు. దేశంలో మత రాజకీయాలు చేయడం వలన హిందూ ధర్మం మీద ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయల కోసం హిందూ ధర్మాన్ని ఎట్టి పరిస్థితిలో విస్మరించరాదని హితవు పలికారు. రామ మందిరం కట్టే వరకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని కోరారు. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు దేశ భవిష్యత్తును కాపాడాలని సూచించారు. ఆయన చూపిన మర్గాన్ని ప్రతి ఒక్కరు ఎంచుకుంటే దేశ భవిష్యత్తు కోసం నడుం బిగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో శ్రీరాంనగర్ సర్పంచ్ ఎస్ ప్రభాకర్‌రెడ్డి, బాకారం సర్పంచ్ రాఘవరెడ్డి, భజరంగ్‌దళ్ మాజీ జిల్లా ప్రముఖ్ నందకిశోర్, భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్షుడు సామ మాధవరెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు పి ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు గున్నాల గోపాల్‌రెడ్డి, నాయకులు శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...