పశు వైద్యంపై విద్యార్థులకు అవగాహన


Sat,April 20, 2019 12:21 AM

తాండూరు, నమస్తే తెలంగాణ : వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు పశువైద్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ మేనేజ్‌మెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తాండూరులోని వ్యవసాయ పరిశోధనా సంస్థ పరిధిలోని బషీరాబాద్ మండలం కాశీంపూర్ గ్రా మంలో ఎన్‌ఎస్‌ఎస్ శిబిరంలో భాగంగా శుక్రవా రం గ్రామీణ పశువైద్యం అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నా రు. పశువైద్యాధికారి శ్రీకర్‌రెడ్డి విద్యార్థులకు పశువైద్యం ముఖ్యంగా ఆవు లు, ఎద్దులు, మేకలు, బర్రెలు, గొర్రెలు వంటి పశువులకు సోకే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలతో పాటు పశు సంపదను ఎ లా కాపాడుకోవాలన్న అంశాలను వివరించారు. అధిక పాల దిగుబడులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఆవులు, బర్రెలకు కృతిమ గర్భోత్పత్తి, గర్భకోశ వ్యాధుల నివారణ వంటి వి షయాలపై వైద్య సిబ్బంది వి ద్యార్థులకు అవగాహన కల్పి ంచారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటయ్య మా ట్లాడుతూ మారుమూల గ్రా మంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం ద్వారా రైతుల కు సేవలందించడం అభినందనీయమన్నారు. గ్రా మాల్లో తరచుగా ఇలాంటి కార్యక్రమాలు కళాశాలల విద్యార్థులు నిర్వహిస్తే ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న కష్ట సుఖాలు తెలుసుకుని వాటికనుగుణంగా తాము చదువుకుంటున్న అంశాలపై మ రింత పట్టు సాధించగలుగుతారన్నారు. అనంత రం 200 గొర్రెలు, 100 మేకలకు విద్యార్థులు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమం లో ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం ఇన్‌చార్జి డాక్టర్ లావణ్య, అనిల్‌కుమార్, తాండూరు శాస్త్రవేత్త సుధాకర్, వైద్యులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...