బాలికలదే పైచేయి...


Thu,April 18, 2019 11:30 PM

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలకు సంబంధించి జిల్లాలో బాలికలదే పై చేయి సాధించారు. ఈ మేరకు గురువారం నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అయితే గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో అధిక మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలో 56 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సా ధించారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో 56 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్ర స్థాయిలో 15వ స్థానంలో నిలిచింది. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో ఉత్తీర్ణత శాతం తగ్గడం గమనార్హం. గతేడాది ఇంటర్ ఫలితాల్లో 61 శాతం మేర విద్యార్థులు ఉత్తీర్ణులుకాగా ఈ ఏడాది 5 శాతం ఉత్తీర్ణత శాతం తగ్గింది. అంతేకాకుండా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం గతేడాదితో పోలిస్తే తగ్గడం గమనార్హం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయారు. మరోవైపు మే 14 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు, సప్లిమెంటరీ పరీక్షా ఫీజు చెల్లింపునకు గాను ఈ నెల 25 వరకు గడువు విధించినట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.

ఇంటర్ ఫలితాల్లో జిల్లా 15వ స్థానం...
ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో మేడ్చ ల్ జిల్లా నిలువగా, జిల్లా 15వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఏడాదిల్లో మొత్తం 14,300 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 50.38 శాతం ఉత్తీర్ణతతో 7205 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ ఏడాదిలో 6508 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకాగా 56 శాతం ఉత్తీర్ణతతో 3650 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ద్వితీయ ఏడాదిలో ఉత్తీర్ణులైన బాలురకు సంబంధించి 3091 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 50 శాతం ఉత్తీర్ణతతో 1555 మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా బాలికలకు సంబంధించి 3417 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా 61 శాతం ఉత్తీర్ణతతో 2095 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ఇంటర్ ప్రథమ ఏడాది పరీక్షా ఫలితాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో జిల్లా 17వ స్థానంలో నిలువగా 46 శాతం మేర విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ ఏడాదిలో మొత్తం 7792 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 3555 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 61 శాతంతో బాలికలు ముందంజలో ఉండగా 39 శాతం బాలురు పూర్తి వెనుకంజలో నిలిచా రు. ప్రథమ ఏడాదిలో బాలికలు 4048 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరుకాగా 2099 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా 3744 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 1456 మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా అదేవిధంగా ఒకేషనల్ ఇంటర్ ఫలితాల్లో జిల్లా 6వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ పరీక్ష ఫలితాలకు సంబంధించి జిల్లాలో 571 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 76 శాతం ఉత్తీర్ణతతో 432 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 243 బాలురు పరీక్షలకు హాజరుకాగా 72 శాతం ఉత్తీర్ణతతో 175 మంది బాలురు, 328 బాలికలు పరీక్షలకు హాజరుకాగా 80 శాతం ఉత్తీర్ణతతో 261 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ఇంటర్ ఒకేషనల్ ప్రథమ ఏడాది ఫలితాలకు సం బంధించి మొత్తం 765 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 53 శాతం ఉత్తీర్ణతతో 409 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 282 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 59 శాతం ఉత్తీర్ణతతో 124 మంది విద్యార్థులు ఉత్తీర్ణులుకాగా, బాలికలకు సంబంధించి 483 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరుకాగా 59 శాతం ఉత్తీర్ణతతో 285 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారు.

మెరిసిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు...
ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు సంబంధించిన పలువురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. జిల్లాలోని కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ముగ్గురు విద్యార్థులు 900లకు పైగా మార్కులు సాధించారు. వీరిలో గోవర్ధన్-బైపీసీ (920 మార్కులు), మేఘన-ఎంపీసీ (914 మార్కులు), లావణ్య-బైపీసీ (911 మార్కులు) సాధించారు. తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీకి సంబంధించి ఇంటర్ ఫలితాల్లో 900 మార్కులకుపైగా ముగ్గురు విద్యార్థులు సాధించగా మరో ఐదుగురు విద్యార్థులు 800కుపైగా మార్కులు సాధించారు. ఇంటర్ ఫలితాల్లో మెరిసిన తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు సంబంధించి అనురాధ-బైపీసీ (910 మార్కులు), వసంత్‌కుమార్-బైపీసీ (873 మార్కులు), కవిత-బైపీసీ (842 మార్కులు), నజియాబేగం-ఎంపీసీ (877 మార్కులు), భవానీ-ఎంపీసీ (816 మార్కులు), నవిత-ఎంపీసీ (803 మార్కులు), దీపిక-సీఎస్‌సీ ఒకేషనల్ (949 మార్కులు), అంబిక సీఎస్‌సీ ఒకేషనల్ (944 మార్కులు), మహేశ్-సీఎస్‌సీ ఒకేషనల్- (917 మార్కులు) సాధించారు.

ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థులు
పరిగి, నమస్తే తెలంగాణ : పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఆ కళాశాలకు చెందిన ఆర్.ప్రవీణ్‌కుమార్ (బైపీసీ) 925 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు. బైపీసీ గ్రూపుకు చెందిన వి.శోభ 9 13 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలువ గా నేనావత్ రాంప్రసాద్ 906 మార్కులు సాధిం చి మూడో స్థానంలో నిలువడం గమనార్హం. ఇదిలావుండగా తెలుగులో పదుల సంఖ్యలో విద్యార్థులకు 99 మార్కులు రావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ రామ్‌చందర్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ అభినందించారు.

మెరిసిన గురుకుల విద్యార్థులు..
కొడంగల్, నమస్తే తెలంగాణ : ఇంటర్ ద్వితీ య ఏడాది పరీక్షల్లో పట్టణంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను సాధించి టాపర్‌లుగా నిలిచారు. మొ త్తం 75 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొనగా 73 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా 99 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు కాబడింది. ఎం పీసీ విద్యార్థి శివకమార్‌కు 957, బైపీసీ విద్యార్థి సతీష్‌కు 963, సీఈసీ విద్యార్థి కల్యాణ్ 924 మార్కులు సాధించారు. అదేవిధంగా కస్తూర్బా గాంధీ కళాశాలలో ఈ విద్యా ఏడాది మొదిటి సంవత్సరం ప్రారంభం కాబడింది. మొత్తం 73 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా అందులో 29 మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీలో భవానీకి 396, బైపీసీలో 368 శారద మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీలో గోవర్ధన్‌కు 920, లావణ్యకు 911, ఎంపీసీలో మేఘనకు 914 మార్కులతో ఉత్తీర్ణత సాధించి కళాశాల టాపర్‌లుగా నిలిచారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...