సేంద్రియ వ్యవసాయంతో చెక్


Thu,April 18, 2019 11:27 PM

తాండూరు రూరల్ : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభంతోపాటు రైతు ఆత్మహత్యల నివారణకు సేంద్రియ వ్యవసాయం మేలు ఏకలవ్య అధ్యాపకుడు డాక్టర్ శేషయ్య తెలిపారు. గురువారం ఫ్రొఫెసర్ జయశంకర్‌సార్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ మేనేజ్‌మెంట్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్) శిబిరంలో భాగంగా మండలంలోని జినుగుర్తి ఏకలవ్య ఫౌండేషన్‌ను సందర్శించారు. ఈ ఫౌండేషన్ పరిధిలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయ పద్దతుల గురించి విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వాహకులు చూయించారు. కాలుష్య కారకమైన పంటల కారణంగా మనిషి పలు రకాల రుగ్మతలకు లోనవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. పురుగు మందుల వాడకం వల్ల భూమిలో లవణాలు తగ్గిపోయి, పంట దిగుబడులు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాకుండా కాలుష్యంతో మనిషి మనుగడకు ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అద్యాపకుడు డాక్టర్ శేషయ్య మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో రసాయనాలు లేకుండా ఉండలేకపోతున్నామని, దీని కారణంగా భూమి, వాయి, నీటి కాలుష్యం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం సేంద్రియ పద్దతులతోనే ఈ ప్రాంతంలో రకరకాల పంటలు పండిస్తున్నామని తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఆర్జించే పలు అంశాల గురించి విద్యార్థినీ, విద్యార్థులు వివరించారు. విద్యార్థులకు ఘనజీవామృతం, ధ్రువజీవామృతం, పంచకావ్యం, ప్రయోగత్మకంగా చూయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లావణ్య, సంధ్యరాణి, అనిల్‌కుమార్, అరుణ, తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...